twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాన్సర్‌తో ప్రముఖ నటుడి జీవన పోరాటం: రహస్యంగా ఇండియా వచ్చి పూజలు!

    |

    ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు అరుదైన క్యాన్సర్ సోకడంతో ప్రస్తుతం యూకెలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈ వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఆయన ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదనే పుకార్లు సైతం గతంలో వినిపించాయి.

    అయితే తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్, అభిమానుల్లో ఆందోళన తొలగించడానికి ఇర్ఫాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ గురించి సంచలన వార్త హాట్ టాపిక్ అయింది.

     రహస్యంగా ఇండియా వచ్చిన ఇర్ఫాన్ ఖాన్

    రహస్యంగా ఇండియా వచ్చిన ఇర్ఫాన్ ఖాన్

    ఇటీవల ఇర్ఫాన్ ఖాన్ రహస్యంగా ఇండియా వచ్చి రెండు రోజులు ఇక్కడ గడిపిన అనంతరం మళ్లీ తిరిగి చికిత్స నిమిత్తం యూకె వెళ్లినట్లు తెలుస్తోంది. తన విజిట్ విషయం ఎవరికీ తెలియకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

    <strong>ఆరు దశల్లో నటుడికి క్యాన్సర్ ట్రీట్మెంట్.. ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి సందిగ్దమే!</strong>ఆరు దశల్లో నటుడికి క్యాన్సర్ ట్రీట్మెంట్.. ఆరోగ్య పరిస్థితి ఇప్పటికి సందిగ్దమే!

    నాసిక్‌లో త్రయంబకేశ్వర్ శివ టెంపుల్‌లో పూజలు

    నాసిక్‌లో త్రయంబకేశ్వర్ శివ టెంపుల్‌లో పూజలు

    నాసిక్ త్రయంబకేశ్వర్‌లోని శివ టెంపుల్‌లో పూజలు నిర్వహించేందుకే ఇర్ఫాన్ ఖాన్ ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. పండితుల సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి హవన్ పూజ నిర్వహించిన అనంతరం తిరిగి లండన్ వెళ్లిపోయారట.

    అందుకే రహస్యంగా

    అందుకే రహస్యంగా

    తాను వస్తున్న విషయం తెలిస్తే మీడియా హడావుడి ఉండటం ఖాయం. దీని వల్ల కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉండటం వల్లనే ఈ విషయాన్ని ఆయన ఎవరికీ తెలియనీయలేదని ఇర్ఫాన్ ఖాన్ సన్నిహితులు అంటున్నారు.

    అత్యంత అరుదైన ‘న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌'

    అత్యంత అరుదైన ‘న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌'

    ఇర్ఫాన్‌ ఖాన్‌ అత్యంత అరుదైన ‘న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌' బారిన పడ్డారు. న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ లక్షమందిలో ముగ్గురు నుంచి ఐదుగురికి వస్తుంది. గత కొన్ని నెలలుగా ఇర్ఫాన్ ఖాన్ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.

    English summary
    According to Bollywood media, Irrfan was in India for two days, but did not want anyone to know about it, said his publicist. He made a brief visit to the Trimbakeshwar Shiva Temple in Nashik, where he performed a havan with pundits.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X