twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంగ్లాదేశ్ తరుపున ఆస్కార్ ఎంట్రీకి ఇర్ఫాన్ ఖాన్ మూవీ

    |

    ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'దూబ్-నో బెడ్ ఆఫ్ రోజెస్' బంగ్లాదేశ్ తరుపున 2019 సంవత్సరానికి గాను ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది. బంగ్లాదేశ్ ఆస్కార్ కమిటీ తమ దేశం తరుపున బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈ చిత్రాన్ని నామినేట్ చేస్తూ ఆస్కార్‌కు పంపారు.

    ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో నటించడమే కాదు, దీనికి సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. అప్పట్లో ఈ సినిమాపై బంగ్లాదేష్‌‌లో నిషేదం కూడా విధించారు. ఇపుడు ఇదే చిత్రం ఆదేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అవ్వడం విశేషం.

    Irrfan Khan’s Doob – No Bed of Roses is Bangladesh’s official entry for Oscars 2019

    ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ మేకర్ పాత్రలో నటించారు. మధ్య వయస్కుడైన దర్శకుడు తన కూతురు స్నేహితురాలితో ఎఫైర్ పెట్టుకోవడం నేషనల్ స్కాండల్‌కు దారితీస్తుంది. ఇలాంటి ఒక ఆసక్తికర కథాంశంతో సినిమా సాగుతుంది.

    'దూబ్-నో బెడ్ ఆఫ్ రోజెస్' చిత్రాన్ని మాస్కో, బుసాన్‌, వాంకోవర్‌, షాంఘై చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. బంగ్లాదేశ్‌ నటి రోకియా ప్రాచీ ఇందులో ఇర్ఫాన్‍‌కు జోడీగా నటించారు. ముస్తఫా సర్వార్‌ దర్శకత్వం వహించారు. భారత దేశం నుండి ఆస్కార్ నామినేషన్‌కు 'విలేజ్ రాక్‌స్టార్స్' అనే అసోం చిత్రాన్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Irrfan Khan starrer Doob – No Bed of Roses, which was once banned in Bangladesh, has been chosen as the country’s official entry for the Academy Awards 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X