For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘నీవు మరణిస్తే పగలబడి నవ్వుకున్నాం.. కానీ నీ మరణం మా గుండెలపై ఇంత భారంగా’

  |

  అత్యంత భారమైన విషాద క్షణాల మధ్య బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు ముంబైలోని వెర్సోవా ఖబరస్తాన్‌లో ముగిశాయి. అతికొద్ది మంది హాజరుకాగా ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు. సినిమా పరిశ్రమ నుంచి ఆయన అంత్యక్రియలకు హాజరైన వారిలో ప్రముఖులు సందీప్ సింగ్, దర్శకులు విశాల్ భరద్వాజ్ తిఘమాన్షు ధూలియా, రాజ్‌పాల్ సింగ్, కపిల్ శర్మ తదితరులు ఉన్నారు. ఇర్పాన్ పాడే మోసిన వారిలో తిఘామన్షు ధూలియా, సందీప్ సింగ్ ఉన్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన సన్నిహితుడు, సినీ ప్రముఖుడు సందీప్ సింగ్ షేర్ చేసిన పోస్టు ఎమోషనల్‌గా మారింది.

  నా భుజాలపై నీ పార్థీవదేహాన్ని..

  నా భుజాలపై నీ పార్థీవదేహాన్ని..


  నీ పార్ధీవ దేహాన్ని నా భుజాలపై మోస్తానని ఎన్నడూ ఊహించలేదు. నీవు నాకు దూరమైనప్పటికీ నా హృదయంపై మోయలేని భారంగా మారుతుందని అనుకోలేదు. ఎన్నో సమయాల్లో కష్టాల్లో ఉంటే నీ భుజాన్ని నాకు ఆసరాగా అందించావు. ఇర్ఫాన్ భాయ్ అందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నీలాంటి మానవతావాది ఎన్నడూ మరణించడు అని సందీప్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు.

  నీతో చివరి అడుగులు నడిచే

  నీ వ్యక్తిగత అభిప్రాయలు, సినిమాపై నీ మక్కువ, జీవితం పట్ల ఫిలాసఫీ మాకు స్ఫూర్తిని రగిలిస్తాయి. అవి మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఇర్ఫాన్ భాయ్‌తో చివరి అడుగులు నడిచే అవకాశం కల్పించిందుకు భగవంతుడా నీకు థ్యాంక్స్. కోట్లాది అభిమానులు, స్నేహితులు తరఫున కడసారి వీడ్కోలు పలకడానికి అవకాశం దొరకడం వరంగా భావిస్తున్నాను. ఈ లోకాన్ని ఇంత అర్ధాంతరంగా వదలివేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇర్ఫాన్ భాయ్ అని సందీప్ సింగ్ తన సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

  అంగ్రేజ్ మీడియంలో చనిపోయే సీన్ చూసి

  అంగ్రేజ్ మీడియంలో చనిపోయే సీన్ చూసి

  అంగ్లేజీ మీడియం దర్శకుడు హోమీ అదాజానియా గుండెలు పిండేసే విధంగా శ్రద్ధాంజలి ఘటించారు. అంగ్లేజీ మీడియం చిత్రంలో ఇర్ఫాన్ చనిపోయే సీన్ చూసి పగలబడి నవ్వుకున్నాం. ఆ సీన్ చూసి సరదాగా, ఎగతాళిగా తీసుకొన్నాం. కొన్ని రోజుల తర్వాత మాకు ఇలాంటి సీన్ ఎదురవుతుందని ఊహించలేకపోయాం. నీవు లేని జీవితం చాలా దుర్భరం. నీ జీవిత ప్రయాణంలో కలిసి అడుగులే అదృష్టం మాకు కలగడం ధన్యం. నీవు మా స్నేహితుడివి అని చెప్పుకొనే భాగ్యం కలిగినందుకు నీ జీవితాంతం రుణపడి ఉంటాం అని హోమీ భావోద్వేగమైన సంతాప సందేశాన్ని పోస్టు చేశారు.

  మీతో అనుభూతులు వెంటాడుతున్నాయి...

  మీతో అనుభూతులు వెంటాడుతున్నాయి...

  అంగ్రేజీ మీడియం సినిమా షూటింగ్‌లో చెప్పిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీతో పంచుకొన్న అనుభూతులు వెంటాడుతున్నాయి. నాకు సినిమా అంటేనే మోహం. స్టార్ డమ్ అంటే నాకు పట్టింపు లేదు అని చెప్పిన విషయాలు నిజమే అనిపిస్తన్నాయి. నీకంటే ఈ గొప్ప స్టార్ ఈ విశ్వంలో ఉంటారా? అని హోమీ అదాజానియా తన పోస్టులో పేర్కొన్నారు.

  Irrfan Khan Only Telugu Movie Mahesh's Sainikudu, We Missed Him In Sahasam
  లాక్‌డౌన్‌లో కూడా చివరి చూపు కోసం

  లాక్‌డౌన్‌లో కూడా చివరి చూపు కోసం

  కరోనా లాక్ డౌన్‌లో ఇర్ఫాన్ ఖాన్ చివరి చూపు కోసం విశాల్ భరద్వాజ్, కపిల్ శర్మ, మికా సింగ్, రాజ్ పాల్ యాదవ్, సందీప్ సింగ్, తిఘమన్షు దులియా వచ్చారు. వెర్సోవాలోని శ్మశాన వాటికలో ఇర్ఫాన్ ఖననం జరిగేంత వరకు అక్కడే విషాద ఛాయలతో ఉన్నారు. అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంగా వీరంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పూర్తయ్యాయి.

  English summary
  Actor Irrfan Khan's last words to his wife sutapa sikdar before his death: Irrfan Khan's last rites completed in versova Kabrastan, Irrfan was buried at the Versova kabrastan in Mumbai on April 29th Coronavirus lockdown makes Bollywood more tragedy: Irrfan Khan's Saeda Begum death news:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X