దూరపు కొండలు.. విజయ్ దేవరకొండని అనసూయ మళ్ళీ కెలికిందా?

Anasuya Bharadwaj: నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ గురించి అప్డేట్ ఇస్తుంది. అంతే కాదు తన ద్రుష్ఠికి వచ్చిన విషయాలపై స్పందిస్తోంది. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే.. వాటిపై కూడా తన వాయిస్ ఇస్తుంది. తనదైన స్టైల్ లో కామెంట్ చేస్తుంది. అయితే.. తాజాగా అనసూయ చేసిన పోస్ట్ నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. అయితే.. ఎవర్ని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టింది? అలాంటి కామెంట్స్ చేయడానికి గల కారణమేంటీ? అనేది చర్చనీయంగా మారింది. ఇంతకీ అనసూయ పెట్టిన పోస్ట్ ఏంటి వివరాల్లోకి వెళ్తే..

అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ ఫేమ్ తో సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ ను చూపించండి. నటనకు ప్రాధాన్యత పాత్రలలో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. తన నటనకు విమర్శలకు నుండి కూడా ప్రశంసలు అందుకుంది.

Is actor anasuya Bharadwaj indirectly comment on Vijay devarakonda Instagram post viral

ఆ తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన పుష్ప 1 సినిమాలో నటించింది. ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ రోల్ లో కనిపించింది. ఈ అమ్మడు కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా అనసూయ లీడ్ లో నటిస్తోంది. ఇప్పటికే తన క్యారెక్టర్ సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. అయితే తాజాగా నటి అనసూయ పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట్ లో తెగ వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. నటి అనసూయ ఇన్స్టాగ్రామ్ వేదికగా 'దూరపు కొండలు నలుపు' అంటూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అయితే.. ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి కామెంట్ చేసిందనే ఎవరికీ అర్థం కావడం లేదు. పుష్ప 2 ప్రిరిలీజ్ ఈవెంట్ తరువాత ఈ ట్వీట్ చేయడంతో హీరో విజయ్ దేవరకొండ ను ఉద్దేశించి పెట్టిందంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రష్మికను హెచ్చరిస్తూ ఈ కామెంట్ చేసి ఉంటుందని మరికొందరు నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ రావడం వెనక
కారణాలు లేకపోలేదు.

Is actor anasuya Bharadwaj indirectly comment on Vijay devarakonda Instagram post viral

గతంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అనసూయకు మధ్య ఓ కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయాలను ఉద్దేశించి 'ఆంటీ' అంటూ ట్రోల్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటికి దీటుగా అనసూయ కూడా ఎన్నో కామెంట్స్ వీడియోలను పోస్ట్ చేసింది. అయితే.. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు అనసూయకు మధ్య ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం, ట్రోల్స్ ఆగిపోవడంతో.. ఈ కోల్డ్ వార్ ముగిసిందని అందరు అనుకున్నారు.

కానీ, తాజాగా అనసూయ 'దూరపు కొండలు నులుపు' అని ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేయడంతో విజయ్ దేవరకొండ ను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందని రౌడీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఇందులో ఏది కరెక్ట్‌ అనేది అనసూయ చెప్పాల్సి ఉంది. మరి అనసూయ మనసులో ఏముందో.. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్‌ చేసిందో తెలియాల్సింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X