ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నిజమే.. ఎట్టకేలకు స్పందించిన రవిబాబు!
అందాల నటి పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీమహాలక్ష్మీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఈ భామ.. అవ్వడానికి ముస్లిం యువతీ అయినా కూడా అచ్చతెలుగు ఆడపిల్లలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. వరుస అవకాశాలను అయితే అందించి పెట్టింది.
ఇక ఈ సినిమా తరువాత తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా మారిన పూర్ణ.. మళ్లీ అల్లరి నరేష్ సరసన సీమ టపాకాయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కామెడీ చిత్రంగా తెరకెక్కిన సీమ టపాకాయ్ మంచి విజయాన్ని అందించింది. ఇక అవును సినిమాతో పూర్ణ.. తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అవును తరువాత పూర్ణ .. అవును భామ గా మారిపోయింది.

రవిబాబు దర్శకత్వంలోనే అవును 2, లడ్డు బాబు, అదుగో లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాల తరువాత పూర్ణకు - రవిబాబు కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి. అందుకే ప్రతి సినిమాలో రవిబాబు.. పూర్ణను తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఈ వార్తలపై పూర్ణ ఎప్పుడు స్పందించలేదు. కానీ, రవిబాబు మాత్రం ఎన్నోసార్లు ఈ ఎఫైర్ పై మాట్లాడుతూనే వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
" పూర్ణతో వరుసగా సినిమాలు చేయడం వలనే ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. ఒక సినిమా తరువాత మరొకటి చేస్తున్న సమయంలో.. నా ప్రతి సినిమాలో ఆమె ఉండడం వలన మా ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా పుకార్లు రావడం ఆలస్యం మీడియా కూడా నిజమెంత అనేది తెలుసుకోకుండా రాయడంతో ఈ వార్త ఇంకా వ్యాపించింది. ఆమెది ఎక్కడో కేరళ. నేను ఇక్కడ .. అనవసరంగా మా ఇద్దరికీ లింక్ పెట్టారు. నా కథకు ఎవరిని ఎంపిక చేయాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుంది.

పాత్రకు సెట్ అయ్యే హీరోయిన్స్ ను మాత్రమే నేను ఎంపిక చేసుకుంటాను. అలా అవును సినిమాకు పూర్ణ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అందుకే ఆమెనే ఎంపిక చేశాను . పూర్ణ చాలా మంచి నటి.. ఎంతో హార్డ్ వర్క్ తో పనిచేస్తుంది. ఆమె సీన్ చేసింది అంటే వన్ మోర్ అడగడానికి నేనే భయపడతాను. అంత శ్రద్దగా పనిచేస్తుంది.
ప్రస్తుతం నేను రష్ అనే సినిమా చేస్తున్నాను. అందులో కూడా పూర్ణ ఉండాలనే కోరుకున్నాను. కానీ, ఈ సినిమా మొత్తం యాక్షన్ కు సంబంధించింది. పూర్ణ డ్యాన్సర్ కాకుండా ఫైటర్ అయ్యి ఉంటే కచ్చితంగా ఆమెతోనే చేసివాడిని" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే పూర్ణ .. రెండేళ్ల క్రితం షాహిద్ అసిఫ్ ఆలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తను వివాహమాడింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం పూర్ణ పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది.


Click it and Unblock the Notifications











