వైఎస్ జగన్‌ను నిండా ముంచేసిన శ్రీరెడ్డి.. వైఎస్ షర్మిలను పచ్చి బూతులు తిట్టిన ప్రభావంతో!
వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే కూలిపోతుంది.. కర్ణుడి చావుకు వేయి కారణాలు అనే సామెతలు వైఎస్ జగన్‌కు శాపంలా మారే విధంగా కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో మంత్రులు బూతు పురాణాలు, అలాగే శ్రీరెడ్డి లాంటి పార్టీ సానుభూతి పరులు మహిళలు, వృద్దులు, యువకులు అనే తేడా లేకుండా పచ్చి బూతులతో వీడియోల పెట్టడం పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా చేసిందనే వాదన సర్వత్రా వినిపిస్తున్నది. తాజాగా షర్మిలపై శ్రీరెడ్డి విప్పిన బూతుల పంచాంగం మాత్రం పార్టీకి నష్టం చేసిందనే ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీరెడ్డికి సభ్యత్వం ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే.. ఆ పార్టీకి మేలు కంటే ఎక్కువ కీడే చేసిందంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ నుంచి చిన్న చిన్న నేతలను ఆమె బూతు వీడియోలు, అసభ్య పదాలు ఉపయోగిస్తూ టార్గెట్ చేయడంపై అందరిలోను అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

వైఎస్ షర్మిలను ఉద్దేశించి నీచమైన భాషతో తిట్టిన తీరుపై అందరూ ఆశ్చర్యపోయారు. రాజన్న బిడ్డపై ఈ రకంగా అక్కసు, విషం చిమ్మే అధికారం ఎవరు ఇచ్చారు? సొంత చెల్లెలిపై శ్రీరెడ్డి వాడిన భాష చూసిన తర్వాత వైసీపీ నేతలు స్పందించకపోవడం అత్యంత దారుణంగా ఆ పార్టీ మహిళలో గుసగుసలాడారు. స్వర్గీయ వైఎస్‌ను ఆరాధించే మహిళా ఓటర్లు మనస్తాపానికి గురవుతున్నారు.
తాజాగా వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన విధానం మాత్రం ప్రతీ ఒక్కరిని వేదనకు గురి చేసింది. స్వర్గీయ వైఎస్ఆర్ కూతురు అనే ఇంగితం లేకుండా.. మర్యాద, గౌరవం లేకుండా ఆయన కూతురును బూతులు తిట్టిన విధానం అన్ని పార్టీల్లోను చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీపై రాజకీయంగా, సిద్దాంతాల పరంగా వ్యతిరేకత ఉన్నా.. ఆయన కుటుంబంపై గౌరవ ప్రదమైన విమర్శలే చేశారే కానీ.. దిగజారుడు వ్యాఖ్యలు చేయడం జరగలేదు. కానీ షర్మిల విషయంలో శ్రీరెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు అనే విషయం మీడియాలో హైలెట్‌గా మారింది.
ఇక షర్మిలను శ్రీరెడ్డి తిట్టిన తీరుపై వైఎస్ విజయమ్మ విడుదల చేసినట్టు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ లేఖ ఫేక్ అంటూ నిర్ణారణకు వచ్చారు. కానీ ఆ లేఖపై విజయమ్మ ఖండించకపోవడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఆ లేఖలో సొంత కొడుకునే దుర్మార్గుడు అనే విధంగా ప్రస్తావించారు. ఇలా శ్రీరెడ్డి వల్ల జగన్ ప్రతిష్ట మరింత మసకబారిందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కొంటున్నారు.
ఇప్పటికే అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు చంద్రబాబు భార్యను అవమానించిన విధానం పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా చేసింది. అయితే అధికార పక్షం ఎంత రెచ్చగొట్టినా విపక్షం మాత్రం సమయనంతో వ్యవహరించారు. ఎన్నికల ముందు శ్రీరెడ్డి విడుదల చేసిన వీడియో మాత్రం మహిళలు అసహ్యించుకొనేలా చేసిందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











