అక్కినేని అఖిల్ నన్ను కాపీ కొడుతున్నాడు
హైదరాబాద్: నేనేదో సరదాగా గెడ్డం పెంచుతుంటే.. మీ డాడీని కాపీ కొడుతున్నావా? అని ఆటపట్టిస్తున్నారు డాడీ అని అఖిల్ అన్నాడు. ఆ మాట చాలా సంతోషాన్నిచ్చింది అంటున్నారు నాగార్జున. నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న 'గ్రీకు వీరుడు' ప్రెస్‌మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఇలా స్పందించారు.
నాగార్జున మాట్లాడుతూ.....''పొద్దున్నే ఐదున్నరకి అఖిల్ ఫోన్ చేశాడు. 'గ్రీకువీరుడు' టీజర్ చూసి తన స్నేహితులంతా మీ డాడీ గ్లామర్ రహస్యమేమిటో తెలుసుకోమని ఒకటే అడుగుతున్నారట. అలాగే ఇరవై రెండేళ్ల వయసున్న కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు నాతో ''అంకుల్... ఇంత అందంగా ఉన్నారేంటి? మీరు మా గ్రూప్‌లోకొచ్చేశారు'' అని అన్నారు.
ఓ పక్క నన్ను అంకుల్ అంటూనే నా గ్లామర్‌ను పొగిడారు'' అని నాగార్జున నవ్వుతూ చెప్పారు. .''నా కెరీర్‌లో 'సంతోషం' ఓ స్పెషల్ మూవీ. దశరథ్ భావోద్వేగాలను బాగా పండిస్తాడు. ఈ సినిమాలో యువతకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. 'గ్రీకు వీరుడు' అంటే మాస్ సినిమా అనుకుంటారని మొదట ఈ టైటిల్ వద్దన్నా. కానీ ఈ టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది'' అన్నారు.


Click it and Unblock the Notifications












