Alia Bhatt weds Ranbir Kapoor..పెళ్లిలో ట్విస్టు అదే.. నో డెస్టినేషన్ వెడ్డింగ్.. మ్యారేజ్ డేట్ ఎప్పుడంటే?

లాక్‌డౌన్‌లో సినిమా షూటింగులు వాయిదా పడటం, అలాగే మూవీ రిలీజ్ లేకపోయవడం అఫైర్, మ్యారేజ్ వార్తలకు కొదవలేకుండా పోయింది. బాలీవుడ్‌లో ప్రేమ పక్షులు మరో మెట్టు ఎక్కి పెళ్లిళ్లకు సిద్దం కావడంతో గత కొద్దికాలంగా ఆ జోరు భారీగా కనిపించింది. పలువురు హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ జాబితాలో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ చేరబోతున్నారు. అయితే ముంబైలో ఆలియా, రణ్‌బీర్ పెళ్లి వార్త వైరల్ అయింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

 రణ్‌బీర్ పెళ్లి పలుమార్లు వాయిదా

రణ్‌బీర్ పెళ్లి పలుమార్లు వాయిదా


కొన్నేళ్లుగా రణ్‌బీర్, ఆలియాభట్ డేటింగ్ వార్తలు ముంబై మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే పెళ్లి వార్తలు, ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే తన తండ్రి, ప్రముఖ నటుడు రిషి కపూర్ ఆరోగ్య పరిస్థితి కారణంగా పలుమార్లు రణ్‌బీర్, ఆలియా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది రిషి కపూర్ మరణించడంతో మరింత వాయిదా పడింది.

పెళ్లి వేదిక ఎక్కడంటే?

పెళ్లి వేదిక ఎక్కడంటే?


అయితే బాలీవుడ్ మీడియా తాజా కథనం ప్రకారం.. 2022 ఏప్రిల్‌లో రణ్‌బీర్, ఆలియా భట్ పెళ్లికి ముహుర్తం పెట్టినట్టు సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా కాకుండా, విలాసవంతమైన హోటల్స్ నిర్వహించకుండా కపూర్లకు సెంటిమెంట్ మారిన వేదికపై ఈ పెళ్లికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం కపూర్ వంశానికి చెందిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో వీరి పెళ్లిని చేయడానికి సిద్దం అవుతున్నారు.

 తల్లిదండ్రుల పెళ్లి వేదికపైనే రణ్‌బీర్ వివాహం

తల్లిదండ్రుల పెళ్లి వేదికపైనే రణ్‌బీర్ వివాహం


కపూర్ ఫ్యామిలీ సభ్యులందరూ ముంబైలోని ఆర్కే హౌస్‌‌ను చాలా సెంటిమెంట్‌గా భావిస్తారు. రణ్‌బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ వివాహం ఈ వారసత్వం నివాసంలోనే జనవరి 20, 1980లో ఇండియన్ సినిమా లెజెండ్ రాజ్ కపూర్ జరిపించారు. ఇప్పుడు రణ్‌బీర్ పెళ్లిని కూడా ఆ వేదికపైనే జరిపించాలని కపూర్ ఫ్యామిలీ నిర్ణయించింది అని బాలీవుడ్ పత్రిక చెప్పింది.

 450 మందితో అతిథుల జాబితా

450 మందితో అతిథుల జాబితా


రణ్‌బీర్, ఆలియా భట్ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ పెళ్లికి ఆహ్వానించేందుకు 450 మంది అతిథుల జాబితాను సిద్ధం చేశారు. ఆలియా, రణ్‌బీర్ పెళ్లి ఏప్రిల్ రెండో వారంలో జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆలియా అమ్మమ్మ నరేంద్రనాథ్ రజ్దాన్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఏప్రిల్ రెండో వారం కంటే ముందే జరిపించాలని భట్ ఫ్యామిలీ కోరినట్టు సమాచారం. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఎలాంటి వార్తను అధికారికంగా ధృవీకరించలేదనేది గమనార్హం.

అలియా, రణ్‌బీర్ కెరీర్ ఇలా..

అలియా, రణ్‌బీర్ కెరీర్ ఇలా..

ఇక ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆలియా భట్ నటించిన RRR చిత్రం ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఇక ఆలియా, రణ్‌బీర్ కలిసి నటించిన బ్రహ్మస్త్ర చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్, మౌనీ రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటించారు. రణ్‌బీర్ యానిమల్ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X