మగధీరకే ‘మగధీర’ అవ్వాలని అల్లు అర్జున్ విశ్వ ప్రయత్నాలు...!?
రామ్ చరణ్ కు 'మగధీర" సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ హీరో అయినా అంతటి విజయాన్ని చవిచూడాలని అనుకుంటాడు. అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ లాగా తనకో మంచి హిట్ చిత్రం కావాలనే గట్టిగా కోరుకుంటున్నాడట. దాంతో కొడుకు కోరిక తీర్చడం కోసం అల్లు అరవింద్ 'బథ్రీనాథ్" సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
'మగధీర" అంతటి సినిమా 'బద్రీనాథ్" కావాలని ఈ చిత్ర దర్శకుడు వివి వినాయక్ దగ్గర అరవింద్, అర్జున్ చెబుతున్నారట. ఆల్ మోస్ట్ 'మగధీర" లానే ఓ భారీ ఫ్లాష్ బ్యాక్ తో 'బధ్రీనాథ్" ఉంటుందని సమాచారం. చరణ్ కి 'మగధీర" ఎంతటి విజయం సాధించి పెట్టిందో 'బధ్రీనాథ్" ద్వారా అర్జున్ అంతటి విజయం అందుకునేలా చేయడానికి వినాయక్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారమ్.
అల్లు అర్జున్ బధ్రీనాథ్ అల్లు అరవింద్ వివి వినాయక్ తమన్న మగధీర రామ్ చరణ్ తేజ్ allu arjun badrinath allu aravind vv vinayak tamanna magadheera ram charan teja


Click it and Unblock the Notifications