Allu Arjun పుష్ప హిట్‌తో జోరు పెంచిన బన్నీ.. బాలీవుడ్ టాప్ దర్శకుడితో ప్యాన్ ఇండియా సినిమా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రసుతం ఆలియాండియా సెన్షేషన్‌గా మారాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా సూపర్ హీరో అయిపోయాడు. ఇంతకుముందు డబ్బింగ్ సినిమాలతోనే హిందీ ప్రేక్షకులను అలరించిన బన్నీ.. పుష్ప సినిమాతో వెండితెర మీద కూడా విజృంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. తెలుగులో ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీయార్ వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ప్రయత్నాలు చేస్తుండడంతో ఇకపై తను కూడా పాన్ ఇండియా సినిమాలే చేయాలని బన్నీ డిసైడ్ అయ్యాడట.

భన్సాలీతో భేటీ..
అల్లు అర్జున్ తాజాగా ముంబై వెళ్లి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిని ఆయన ఆఫీస్‌లో కలిశాడు. ప్రత్యేకంగా ఆఫీస్‌కు వెళ్లి సంజయ్‌ను బన్నీ కలవడంతో ఆ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందనే చర్చ అప్పుడే మొదలైపోయింది. భన్సాలీ రూపొందించిన `గంగూబాయ్ కతియావాడి` సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన తర్వాతి సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలో హీరో బన్నీయే అని టాక్ నడుస్తోంది. మరి, ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

పాన్ ఇండియాపైనే పూర్తి దృష్టి..
అల్లు అర్జున్ తన చిత్రాలను తెలుగుతో పాటు మలయాళంలోనూ సమాంతరంగా విడుదల చేస్తుంటాడు. బన్నీకి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మలయాళంలోనూ అంతే క్రేజ్ ఉంది. అక్కడి స్టార్ హీరోల సినిమాలకు సమానంగా బన్నీ సినిమాలు విడుదలవుతుంటాయి. `పుష్ప` సినిమాతో హిందీ ఇండస్ట్రీలో కూడా బన్నీ పాగా వేశాడు. ఇకపై తను చేయబోయే సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఉండాలని బన్నీ డిసైడ్ అయ్యాడట. వీలు కుదిరితే అట్లీ లేదా మురుగదాస్ వంటి దర్శకులతో సినిమాలు చేసి తమిళంలోనూ మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నాడట.

అల్లు అర్జున్ నెంబర్ వన్..
పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా తాజాగా నిర్వహించిన మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో అల్లు అర్జున్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంతకు ముందు మహేష్ బాబు ఈ పొజిషన్‌లో ఉండేవాడు. గత జనవరిలో మహేష్‌ను వెనక్కి నెట్టి బన్నీ ఆ ప్లేస్‌కు వెళ్లాడు. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా బన్నీ తన నెంబర్ వన్ పొజిషన్‌ను కాపాడుకున్నాడు. `పుష్ప` సినిమా వల్ల బన్నీకి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దేశవ్యాప్తంగా బన్నీ గురించి చర్చ జరగడంతో మొదటి స్థానానికి చేరుకున్నాడని అంచనా.

బన్నీ తర్వాతి సినిమాలేంటి..
అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సీక్వెల్ సినిమాలో నటిస్తున్నాడు. అది ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బన్నీ కోసం వేణు శ్రీరామ్, మురుగదాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు కథలు సిద్ధం చేసుకున్నారు. వీటిలో వేణు శ్రీరామ్ `ఐకాన్` సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. అయితే నిజం ఏంటో ఇంకా తెలియదు. మిగతా దర్శకులు మాత్రం బన్నీతో సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నారు.
Recommended Video


వ్యాపార ప్రకటనలతో బిజీ బిజీ
`పుష్ప` ఇచ్చిన కిక్‌తో బన్నీ కమర్షియల్ యాడ్స్‌తో కూడా బిజీ అయిపోయాడు. వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తున్నాడు. ఇప్పటికే `రాపిడో`, `జొమాటో`, `శ్రీచైతన్య` వంటి బ్రాండ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండ్లను బన్నీ ప్రమోట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











