రాశీఖన్నా కాదట.. మరో టాలీవుడ్ హీరోయిన్‌తో బూమ్రా డేటింగ్... అసలు కథేంటంటే
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. భారతీయ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడనై జస్ప్రిత్ బూమ్రాతో డేటింగ్ చేస్తున్నారనే విషయం మీడియాలో హల్‌చల్ రేపుతున్నది. ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్ టోర్నిలో రాణిస్తున్న బూమ్రాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వచ్చిన వార్తలపై అనుపమ పరమేశ్వరన్ స్పందించారు. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే..

క్రికెటర్ బూమ్రాతో డేటింగ్
జస్ప్రిత్ బూమ్రాతో అఫైర్ వార్తలు నా దృష్టికి వచ్చాయి. అయితే క్రికెటర్‌గా ఆయన పేరు పరిచయం ఉంది. కానీ వ్యక్తిగతం నాకు ఆయన ఎవరో తెలియదు. క్రికెటర్‌గానే పరిచయం ఉంది తప్ప అంతకంటే ఎక్కువగా ఏమీ తెలియదు. అలాంటి నాకు ఆయనకు రిలేషన్ అంటగడుతారా అని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలే అని ఆమె స్పస్టం చేశారు.

రూమర్లు క్రియేట్ చేయొద్దు
తనతో ఇతరులకు రిలేషన్ అంటగట్టే వార్తలు రాసే ముందు వాస్తవమేమిటో తెలుసుకోవాలి. ఆ వార్తలో నిజా నిజాలు తెలుసుకొని రాస్తే మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రూమర్లు క్రియేట్ చేస్తే మా మనోభావాలు దెబ్బ తింటాయి. సెలబ్రిటీలమైనంత మాత్రాన మాకు ఓ జీవితం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి అని అనుపమ అన్నారు.

రాశీఖాన్నాతో అఫైర్ అంటూ
క్రికెటర్ జస్టిన్ బూమ్రాకు సినీ తారలకు లింక్ ఉన్నట్టు గతంలో కూడా భారీగా వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం అందాల తార రాశీఖాన్నాతో బూమ్రా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు సెన్సేషన్‌గా మారాయి. అయితే అవన్నీ గాలి వార్తలే అని స్పష్టమైంది. తాజాగా బూమ్రాతో అనుపమ డేటింగ్ వార్త సెన్సేషన్‌గా మారింది. అయితే ఆమె స్పందించడంతో అసలు విషయం బయటపడింది.

రాక్షసుడు మూవీలో అనుపమ
అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం తెలుగులో రాక్షసుడు అనే చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో అమలాపాల్ నటించిన పాత్రలో కనిపించనున్నారు. రాక్షసన్ తమిళ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో రాక్షసుడు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











