బాలీవుడ్ క్రేజీ స్టార్ తో అనుష్క దుమ్మురేపుతానంటోంది...
కోలీవుడ్ లో అనుష్క దుమ్మురేపుతోంది. క్రేజీస్టార్ సూర్య సరసన 'సింగం" లో నటించి ఒయ్యారాలు ఒలికించింది. దీంతో కోలీవుడ్ కుర్రకారు అనుష్క మరిన్ని సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఇదిలా వుండగా కోలీవుడ్, టాలీవుడ్ సక్సెస్ చవిచూసిన సింగం చిత్రాన్ని హిందీలో తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోగా అజయ్ దేవ్ గన్ నటించనున్నారు. కాగా అజ్ దేవ్ గన్ సరసన అనుష్క నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే అనుష్క ఈ చిత్రంతో తొలిసారిగా బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. అయితే ఇప్పటికే శ్రియ, త్రిష, అసిన్ వంటి తారలు బాలీవుడ్ కెళ్లారు. వీరిలో శ్రియ, అసిన్ రాణిస్తుండగా త్రిష మాత్రం వెళ్లినంత వేగంగా తిరిగి చెన్నై వచ్చేసి టాలీవుడ్ పై మొగ్గుచూపుతోంది.
అనుష్క సూర్య సింగం అజయ్ దేవ్ గన్ బాలీవుడ్ అసిన్ శ్రియ త్రిష anushka surya singam ajay devgan bollywood asin shriya trisha


Click it and Unblock the Notifications