పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి సరైన జోడి అనుష్క...!?
టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ, కుర్రాళ్లలో తనకంటే పొడుగ్గా ఉండేవాళ్లందరితోను నటించేిసన అనుష్క ఇంతదాకా పవన్ కళ్యాణ్ తో మాత్రమే నటించలేదు. గతంలో ఓసారి పవన్ తో నటించే అవకాశం ఆమెకి వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. ఎట్టకేలకు పవర్ స్టార్ తో అనుష్కకి పరిచయం జరగడానికి వేదిక సిద్దమవుతోంది. 'గబ్బర్ సింగ్" సినిమాలో అనుష్క కథానాయికగా నటించే అవకాశముందని తెలిసింది.
అనుష్క కి ప్రస్తుతం కాలం కలిసి రాకపోయినా కానీ ఆమె క్రేజ్ కి ఉన్నపళంగా వచ్చిన ఢోకా ఏమీ లేదు కాబట్టి, ఎప్పుడూ హైదరాబాదులోనే, అందుబాటులోనే ఉంటుంది కాబట్టి, షూటింగ్ కి ఎలాంటి అవాంతరం ఏర్సడదు కాబట్టి అనుష్కకే 'గబ్బర్ సింగ్" స్టాంప్ వేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ వార్తని ఇంకా గబ్బర్ సింగ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ అవకాశం వచ్చినందుకు త్రిష మాదిరి ఎగిరి గత్తే ఎస్తోందో లేదా ఏకంగా హిట్టే ఇస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











