»   » అనుష్కతో దొరికిపోయిన విరాట్ కోహ్లి!

అనుష్కతో దొరికిపోయిన విరాట్ కోహ్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: విరాట్ కోహ్లి...ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ఫాంతో ప్రిన్స్‌లా వెలిగిపోతున్నాడు. టాలెంటుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా ఆకర్షిస్తున్నాడు. సారా జేన్ డియాస్‌తో విడిపోయిన తర్వాత కోహ్లీ మరో హీరోయిన్ అనుష్క శర్మకు దగ్గరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ షాంపూ యాడ్ ఫిల్మ్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు దగ్గరయ్యారని టాక్.

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం...ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఇటీవల ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారని తెలుస్తోంది. ఇద్దరూ కార్లో షికార్లు కొట్టినట్లు సమాచారం. కార్లో ఇద్దరూ చాలా చనువుగా కూర్చుని ముచ్చటించారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

గతంలో విరాట్ కోహ్లి మాజీ మిస్ ఇండియా సారా జేన్ డియాస్‌తో కొంత కాలం పాటు డేటింగ్ చేసాడు. అయితే వారి డేటింగ్ కేవలం పార్టీల వరకే సాగింది. అయితే తాజాగా అనుష్క శర్మతో విరాట్ కోహ్లి డేటింగ్ హద్దులు దాటి సాగుతోందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary
Virat Kohli, the new Prince of Team India, has innumerable female fan following across the globe. Adding up to this, we now hear that Kohli has also managed to charm quite a few Bollywood hotties as well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu