twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో అనుష్క సినిమా.. ఆ చిత్రానికి కాపీనా?

    2005లో విడుదలైన కార్ప్స్ బ్రైడ్ అనే హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టి ఫిల్లౌరి చిత్రాన్ని నిర్మించినట్టు వచ్చిన వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

    By Rajababu
    |

    బాలీవుడ్‌లో పీకే, ఎన్‌హెచ్10, దిల్ దడ్కనే దో, సుల్తాన్, యై దిల్ హై ముష్కిల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో అనుష్క శర్మ దూసుకెళ్తున్నది. అనుష్క నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్ మారడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అని పేరొచ్చింది. తాజాగా ఆమె ఫిల్లౌరి అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ సోమవారం విడుదలైంది. అయితే 2005లో విడుదలైన కార్ప్స్ బ్రైడ్ అనే హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టి ఈ చిత్రాన్ని నిర్మించినట్టు వచ్చిన వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

    ఫిల్లౌరీ కథేంటి?
    ఓ ఎన్నారై పెళ్లి కొడుకును దెయ్యం వెంటాడుతూ పెండ్లి చేసుకొమని వేధిస్తుంటుంది. దెయ్యం పెట్టే ఇబ్బందిని ఎలా ఎదుర్కొన్నాడు. అసలు దెయ్యం పెళ్లి కొడుకును ఎందుకు వేధిస్తున్నదనే అంశం ఈ సినిమా కథ. పెళ్లి కొడుకుగా సూరజ్ శర్మ నటించారు. ఫిల్లౌరీ కథ దాదాపు కార్ప్స్ బ్రైడ్ మాదిరిగానే ఉంటుందని నిర్మాత, హీరోయిన్ అనుష్క శర్మ తెలిపింది.

     బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అనుష్క

    బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అనుష్క


    2008లో రబ్ నే బనా ది జోడి చిత్రంతో అనుష్కశర్మ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత బ్యాండ్ బజా బరాత్, లేడీస్ వర్సెస్ వికీ బెహెల్, జబ్ తక్ హై జాన్, పీకే, ఎన్‌హెచ్10, దిల్ దడ్కనే దో, సుల్తాన్, యై దిల్ హై ముష్కిల్ నటించింది. ఆమె నటించిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలు ఘన విజయం సాధించాయి.

     విరాట్ కోహ్లీతో అఫైర్.. రొమాంటిక్ సీన్స్

    విరాట్ కోహ్లీతో అఫైర్.. రొమాంటిక్ సీన్స్


    సూపర్ హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో అగ్రతారగా మారిన అనుష్క శర్మ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో అఫైర్ సాగిస్తున్నది. కోహ్లీ ఆడే మ్యాచ్ లకు హాజరై అభిమానులను కనువిందు చేస్తున్నది. వీరిద్దరూ పెండ్లి చేసుకొంటారనే రూమర్ కూడా వచ్చింది. కోహ్లీలో అన్యోన్యయంగా ఉంటూ పలు సందర్భాల్లో అనుష్క కనిపించింది.

     హీరోయిన్.. నిర్మాతగా అనుష్క

    హీరోయిన్.. నిర్మాతగా అనుష్క


    పలు సూపర్ హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న అనుష్క శర్మ ఫిల్లౌరీ చిత్రంతో నిర్మాతగా మారారు. రొమాంటిక్, కామెడీ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో దల్జిత్ దోసాన్, సూరజ్ శర్మ, మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది.

     కార్ప్స్ బ్రైడ్, ఫిల్లౌరీది ఒకటే స్టోరీ

    కార్ప్స్ బ్రైడ్, ఫిల్లౌరీది ఒకటే స్టోరీ


    దెయ్యం కారణంగా ఓ పెళ్లి కొడుకు ఎదురైన సమస్యల ఆధారంగా కార్ప్స్ బ్రైడ్ యానిమేషన్ చిత్రం రూపొందింది. ఇందులో హీరో పాత్రకు ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ డబ్బింగ్ చెప్పారు. దెయ్యం పాత్రలో హెలెనా బోన్హామ్ కార్టర్ నటించింది. 2005లో విడుదలైన ఈ చిత్రానికి టిమ్ బర్టన్ దర్శకత్వం వహించాడు.

    English summary
    Anushka Sharma relealed her first venture Phillauri trailer on Monday. There is news that Phillauri film inspired from 2005 animated film Corpse Bride. Both the films have an eery similarity when it comes to the idea.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X