బాలయ్యతో దాసరి హిట్టివ్వగలరా?
బాలకృష్ణ రెండు రోజుల క్రితం దాసరి లేటెస్ట్ చిత్రం యంగ్ ఇండియా స్పెషల్ షో వేయించుకుని చూడటం జరిగింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఆ చిత్రం చూసిన తర్వాత బాలయ్య ఏమి నిర్ణయం తీసుకుంటాడా అని చాలా మంది ఎదురు చూసారు..కానీ అలాంటిదేమీ జరగలేదు. అయితే యంగ్ ఇండియా ప్లాఫ్ కావటంతో దాసరి మాత్రం చాలా ఫీలయ్యారని చెప్తున్నారు. ఆయన యూత్ కి పోటీ ఇస్తానంటూ అటువంటి టైటిల్ ని మాత్రమే పెట్ట పాత చింతకాయపచ్చడి లాంటి పాయింటుతో టీవీ న్యూస్ లను కలిపి స్క్రిప్టు తయారు చేసారని విమర్శలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన కొత్త తరహా కథనంతో వస్తేనే బాలకృష్ణతో హిట్టవగలరని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. ఇక ఈ చిత్రానికి పరమవీర చక్ర అనే టైటిల్ ని పెట్టారు. బొబ్బలిపులి రీమేక్ గా ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేస్తున్నారంటూ మరో వెర్షన్ వినపిస్తోంది. ఏదైమైనా చాలా కాలం తర్వాత సింహాతో హిట్టు కొట్టిన బాలయ్యని సరిగ్గా ప్రొజెక్టు చేసి హిట్టు కొడతారని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











