బాలయ్య పంచ్ డైలాగ్స్! జగన్‌ను ఉద్దేశించా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా సినిమా 'అధినాయకుడు' చిత్రంలోని డైలాగులు మరోసారి వివాదాస్పదం అవుతోంది. ఈ డైలాగులు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువత నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించినట్లుగా ఉందనే వాదన సర్వత్రా చర్చనీయాంశం అయింది.
డైలాగ్ ఏమిటంటే...
''మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గానీ, రోడ్డు మీద బొమ్మల్లోకాదు. ఉన్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో, చెబుతావా..? చెప్పించమంటావా?'' అంటూ తాజాగా విడుదలైన 'అధినాయకుడు' ట్రైలర్లో ఉంది. తన తండ్రి, దివంగత వైఎస్‌ఆర్ విగ్రహాలు ఊరూరా, వాడ వాడల ఆవిష్కరిస్తూ జగన్ తన రాజకీయ జర్నీ కొనసాగిస్తున్న నేపథ్యంలో.....బాలయ్య సినిమాలోని ఈ డైలాగ్ వివిధ రకాల సందేహాలకు దారి తీస్తోంది.
మరో వైపు ఇందులో ముసలి గెటప్‌లో ఉండే బాలయ్య పాత్ర...పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా టార్గెట్ చేస్తుందని, ఆయనపై ఇండైరెక్టుగా రాజకీయ విమర్శలు చేస్తారని అంటున్నారు. ఆ మధ్య బాలయ్య మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించడం, చిరంజీవి స్పందిస్తూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా ద్వారా చిరుపై విమర్శల చేయొచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ ఈచిత్రంలో తొలి సారిగా మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి


Click it and Unblock the Notifications











