ఆ హీరోయిన్ తో బాలయ్య ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నాడా..!?
తాజాగా నటిస్తున్న 'పరమవీరచక్ర' షూటింగ్ తో ప్రముఖ హీరో బాలకృష్ణ తలమునకలై ఉన్నాడు. ఆ చిత్రంలో హీరోయిన్లుగా నేహాధూపియా, అమీషా పటేల్ నటిస్తున్నారు. మరో కీలకమైన పాత్రలో షీలా కూడా నటిస్తోంది. నేహా ధూపియా కంపెనీలో బాలకృష్ణ ఖుషీగా ఉంటున్నాడని సెట్ లో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సరదా సరదా కనిపించే నేహాధూపియా కూడా బాలకృష్ణ కంపెనీని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిసింది. మంచి వ్యక్తిత్వంతో గొప్ప ప్రొఫెషనలిజాన్ని కనబరుస్తోందంటూ బాలయ్య ఇటీవల నేహా ధూపియాను పొగడ్తలతో ముంచెత్తాడు. కొద్ది వారాల క్రితం అమీషా పటేల్ తో కూడా బాలకృష్ణ కబుర్లు చెబుతూ కనిపించాడు. కానీ బాలయ్య హృదయంలో నేహా ధూపియాకు ప్రత్యేక స్థానం ఉన్నట్టు కనిపిస్తోంది. అంతేకాక నేహాను హీరోయిన్‌గా తీసుకోవాల్సిందిగా సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖ నిర్మాతలు, దర్శకులకు బాలకృష్ణ సిఫార్సు చేసినట్టు టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











