బాలయ్యనే నమ్ముకున్న ఆ ఐదుగురు..!
సినిమా రంగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు హిట్లు..ప్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ సాఫీగా లాగించేస్తుంటారు. మిగతా వారి భవిష్యత్ మాత్రం సినిమా హిట్టు, ప్లాపుల మీదనే ఆధార పడి ఉంటుంది. సినిమా హిట్టయితే ఓకే..లేకుంటే వాళ్లకి అవకాశాలు ఇచ్చే వారే ఉండరు.
తాజాగా 'అధినాయకుడు' చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా హిట్టయినా, ప్లాపయినా బాలయ్యకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. మిగతా వారి భవిష్యత్ మాత్రం సినిమా జయాపజయం మీదనే ఆధార పడి ఉంది. ఈ చిత్రాన్ని నిర్మించిన కుమార్ చౌదరి, దర్శకత్వం వహించిన పరుచూరి మురళితో పాటు హీరోయిన్లు లక్ష్మిరాయ్, సలోని, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ 'అధినాయకుడు' చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
ఎన్నో అప్పుల పాలై కిందా మీదా పడి 'అధినాయకుడు' చిత్రాన్ని నిర్మించిన కుమార్ చౌదరి...ఈ చిత్రం హిట్టయితే తన కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తున్నాడు. ఇక గతంలో నీ స్నేహం, పెద బాబు, ఆంధ్రుడు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్లాపు దర్శకుడిగా పేరుతెచ్చుకున్న మురళి ఈ చిత్రం ద్వారా తొలి హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.
ఇక హీరోయిన్ల మార్కెట్లో లక్ష్మిరాయ్, సలోనిల స్థానం ఏమిటో అందరికీ తెలిసిందే. అడపాదడపా అవకాశాలు దక్కించుకోవడానికే చాలా కష్టపడుతున్న వీరిద్దరు.....అధినాయకుడు చిత్రం తమ దిశ మారుస్తుందనే ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో విచ్చలవిగా గ్లామర్ షో చేసిన లక్ష్మిరాయ్ అయితే మరీనూ...


Click it and Unblock the Notifications











