బాలయ్య నాన్నను తలపించాడా?
తన తండ్రి సీనియర్ ఎన్టీ రామారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నందమూరి బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమా ద్వారా విజయం సాధించారా అనే ఆసక్తికరమైన ప్రశ్న ముందుకు వస్తోంది. లవకుశ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి అశేష ప్రేక్షకాదరణ పొందిన ఎన్టీ రామరావు స్థాయిలో బాలయ్య శ్రీరామరాజ్యం సినిమాలో నటించాడా అనే పోలికను చాలా మంది ముందుకు తెస్తున్నారు. స్టిల్స్ చూస్తే దాదాపుగా లవకుశలోని ఎన్టీఆర్‌ను పోలినట్లే బాలయ్య ఉన్నాడు. సినిమా కూడా లవకుశ సినిమాకు రీమేక్ అనే చెబుతున్నారు.
ఎన్టీ రామారావుకు వీరాభిమాని అయిన శ్రీపతి రాజేశ్వర్ మాత్రం ఎన్టీఆర్ లాగే బాలయ్య పౌరాణిక సినిమాల్లో వెలుగొందుతాడని నమ్మబలుకుతున్నారు. బాలయ్య శ్రీరామరాజ్యంలోని గెటప్‌కు ఎన్టీరామారావు లవకుశలోని గెటప్‌కు ఏ మాత్రం తేడా లేదని చెబుతున్నారు. లవకుశ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అందులోని పాటలు ఇప్పటికీ తమ ప్రజాదరణను ప్రదర్శిస్తున్నాయి. లవకుశ సినిమాలో ఏది హైలెట్ అంటే ఇది అని ప్రత్యేకంగా చెప్పలేం. దేనికదే హైలెట్. లవకుశ సినిమా చూసి ఆనందించిన పాత తరం ప్రేక్షకులకు శ్రీరామరాజ్యం నచ్చుతుందో లేదో చూడాలి. అయితే, దర్శకుడు బాపు మీద ఉన్న గౌరవం వారిని మెప్పించేందుకు ఉపయోగపడవచ్చు.
లవకుశ సినిమాను చూసి ఆనందించిన పాత తరం ప్రేక్షకులు శ్రీరామరాజ్యం సినిమా చూసి ఫరవాలేదన్నా అది మంచి టాక్ అన్నట్లే. ఏమైనా, పలు రకాలుగా శ్రీరామ రాజ్యం, బాలకృష్ణ శ్రీరాముడి పాత్ర చర్చనీయాంశాలుగా మారాయి.


Click it and Unblock the Notifications











