ఆ టీవీ సీరియల్ నిండా బూతే, సర్వాత్రా ఆందోళన!
హైదరాబాద్: వరల్డ్ వైడ్ పాపులర్ అయిన బిబిసి ఛానల్ లో తాజాగా ప్రసారం అవుతున్న ఓ టీవీ సీరియల్ వివాదాస్పదం అయింది. ఈ సీరియల్ నిండా బూతులు సీన్లు, పోర్న్ సీన్లు ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బుల్లి తెరపై ఇలాంటివి ప్రసారం కావడానికి వీల్లేదని, బ్యాన్ చేయాలని బ్రిటన్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
17వ శతాబ్దంలో ఫ్రాన్స్ ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా 'వర్సల్లెస్' అనే సీరియల్ తెరకెక్కించారు. 21 మిలియన్ పౌండ్లు(దాదాపు రూ. 200 కోట్లు) ఖర్చు పెట్టి ఈ సీరియల్ రూపొందించారు. కథాను సారం సీరియల్ లో కొన్ని పచ్చి సెక్స్ సీన్లు, నగ్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

సీరియల్ తొలి ఎపిసోడ్ లో సెక్సుకు సంబంధించిన అంశాలు చూపెట్టారు. చారిత్రక కథనం పేరుతో సెక్స్ సీన్లు తెరకెక్కించడాన్ని బ్రిటన్ ఎంపీలు, కుటుంబ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సీరియల్ పై ఫ్రాన్స్ లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరించి ఇందులో చూపెడుతున్నారని పలువురు మండి పడుతున్నారు.
పోర్న దృశ్యాలు, నగ్న దృశ్యాలు ఉన్న సీరియల్ ను డెలీషియస్ ట్రీట్ గా బిబిసి పేర్కొనడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ సీరియల్ పై వివాదం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











