ఆ 30 నిమిషాలే.. కల్కి 2898 ఏడీ, హనుమాన్, కాంతారాను కాపాడింది అదేనా?

సినిమా అనేది ఒక మాయాజాలం, ఒక భ్రమ. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడమే సినిమా టెక్నిక్. ప్రేక్షకుడిని ఒక ఊహాజనిత లోకంలోకి తీసుకెళ్లి నవ్వించి, ఏడిపించి, ప్రేమించి, లాలించడమే సినిమా. ఎక్కడా బోర్ కొట్టకుండా, మునివేళ్లపై నిలబెట్టించి .. రెండున్నర గంటల పాటు కుర్చీలో కూర్చోబెట్టడంపైనే దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వచ్చి, నిర్మాత నిలువునా మునిగిపోతాడు. అలా ప్రేక్షకులను మాయ చేయగల దర్శకులు కొందరే ఉంటారు. అందుకే 100 సినిమాలు తీస్తే వాటిలో విజయం సాధించే వాటిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.

తాను చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు 24 క్రాఫ్ట్స్ సాయంతో చెప్పి మెప్పించగలగాలి. ప్రతి సన్నివేశానికి లింక్ కుదర్చగలగాలి అప్పుడే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది. కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ బాగుంటే, సెకండ్ పార్ట్ డల్‌గా ఉంటుంది. ఇంకొన్ని సినిమాలు ఫస్టాఫ్ డల్‌గా ఉంటే , సెకండ్ హాఫ్ బాగుంటుంది. కొన్నిసార్లు మాత్రమే మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు కేవలం క్లైమాక్స్ బాగుండటం వల్లే హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దీనికి కాంతారా, హనుమాన్ లేటెస్ట్‌గా కల్కి 2898 ఏడీ సినిమాలు మంచి ఉదాహరణ.

Is because of Climax episodes of Kalki 2898 AD Hanuman Kantara Saved

ఇందులో తొలుత చెప్పుకోవాల్సింది కాంతారా గురించి. రిషబ్ శెట్టి , సప్తమి గౌడ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి కన్నడ సినిమా సత్తాను చాటి చెప్పింది. చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు సాధించడంతో పాటు యావత్ దేశాన్ని ఊపేసింది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా కాంతారాను ప్రేక్షకులు నెత్తిన పెట్టేసుకున్నారు. కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో రిషభ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫీదా అయిపోయారు. ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ అని విమర్శకులు మెచ్చుకున్నారు. ఆదివాసీల దైవం పింజర్లీ దేవత హీరోను ఆవహించిన సమయంలో వచ్చే శబ్ధం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కాంతారా సినిమా ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ ఎపిసోడ్‌లోనే పెట్టినట్లుగా ఉంటుంది. కాంతారాలో ఎలివేషన్స్ సీన్లున్నా.. మాస్‌ను మెప్పించే యాక్షన్ సీక్వెన్స్ పెట్టినా, ఎంట్రీ సీన్ ఉన్నా కూడా అవన్నీ క్లైమాక్స్ ముందు దిగదుడుపే అనిపిస్తుంది.

ఈ కోవలోకే వస్తుంది హనుమాన్. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్యన విడుదలైనప ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక సాధారణ యువకుడు సూపర్ మేన్‌గా ఎలా మారాడాడు.. ఓ పవర్ కోసం శత్రువుతో ఎలా పోరాడాడు అన్నదే హనుమాన్ సినిమా.

కానీ హనుమాన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది మాత్రం క్లైమాక్స్ సీన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. చివరి పది నిమిషాలను హనుమాన్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లి , ఎక్కడో నిలబెట్టింది.. సినిమా ఘన విజయం సాధించడానికి ఆ పది నిమిషాలే కారణమని విమర్శలు సైతం ప్రశంసించారు. చివరిలో ఆంజనేయ స్వామి ఎంట్రీని ప్రశాంత్ వర్మ అద్భుతంగా చూపించారు.

Is because of Climax episodes of Kalki 2898 AD Hanuman Kantara Saved

ఇక తాజాగా మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. భారతీయ పురాణాలకు, సైన్స్ ఫిక్షన్‌ను జోడించి నాగ్ అశ్విన్ తెరకెక్కించిన అద్భుతమే ఈ చిత్రం. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అత్యున్నతంగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

కానీ అన్నింటికి మించి క్లైమాక్స్ బాగా పండటంతోనే కల్కికి హిట్ టాక్ వచ్చిందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సో .. సోగా ఉన్నా క్లైమాక్స్ ఒక్క దాని వల్ల సినిమా రిజల్టే మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద సినిమా మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండి.. దానిని ఒక 20 నిమిషాల పాటు పట్టు సడలకుండా చూపించగలిగితే బొమ్మ బ్లాక్ బస్టరేనని ఈ సినిమాలు నిరూపించాయి. ప్రేక్షకుడిని ఎమోషనల్‌గా లింక్ చేయగలిగిన ఏ సినిమాకైనా బాక్సాఫీస్ వద్ద తిరుగుండదని ఇవి చెబుతున్నాయి.

More from Filmibeat

Read more about: kalki 2898 ad kantara hanuman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X