twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా రివ్యూలా? సామాజిక వర్గాల సమీక్షలా? ఎన్టీఆర్ ఆగ్రహానికి కారణమదేనా?

    ఎలాంటి పరిశ్రమలోనైనా సామాజిక వర్గాల ప్రభావం, ఆధిపత్య పోరాటం ఉండటం సహజం. ఇక సినిమా పరిశ్రమకు వస్తే టాలీవుడ్‌లో ఆ ప్రభావం ఎక్కువే అనే మాట వినిపిస్తుంటుంది.

    By Rajababu
    |

    ఎలాంటి పరిశ్రమలోనైనా సామాజిక వర్గాల ప్రభావం, ఆధిపత్య పోరాటం ఉండటం సహజం. ఇక సినిమా పరిశ్రమకు వస్తే టాలీవుడ్‌లో ఆ ప్రభావం ఎక్కువే అనే మాట వినిపిస్తుంటుంది. ఎన్నో ఏళ్లుగా కేవలం ఓ రెండు సామాజిక వర్గాలదే బలమైన ఆధిపత్యంగా కనిపిస్తుంటుంది. బయటకు కనిపించకపోయినా ఏదో రూపంలో ఏదో పరిస్థుతుల్లో అది పరోక్షంగా బయటపడుతుంది. భారీ సినిమాలు రిలీజ్ అయితే మాత్రం ఆ విభేదాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఓ వర్గం మరో వర్గంపై ధ్వజమెత్తుకోవడం చూస్తే సామాజిక వర్గాల ప్రభావం సినిమా పరిశ్రమపై ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. సామాజిక వర్గాలను బట్టే సినిమా రివ్యూలు ఆధారపడి ఉంటాయనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆ పరిస్థితి బాగానే కనిపిస్తున్నది. మొన్న దువ్వాడ జగన్నాథం, నేడు జై లవకుశ రూపంలో అలాంటి పరిస్థితి కనిపించడం మచ్చు తునకలని చెప్పవచ్చు. జై లవకుశ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ వెలిబుచ్చిన ఆగ్రహం అందులో ఓ భాగమనే చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమాలపై రివ్యూల పేరుతో జరుగుతున్న దండయాత్ర గురించి ఓ సారి పరిశీలిస్తే..

    సినిమా రిలీజ్ అయితే..

    సినిమా రిలీజ్ అయితే..

    టెక్నాలజీ అభివృద్ధి చెందని సమయంలో ఓ సామాజిక వర్గం హీరో సినిమా రిలీజ్ అయితే మరో సామాజిక వర్గం అభిమానులు, కార్యకర్తలు హాలు నుంచి పాట వచ్చినప్పుడో లేదా మరో సందర్భంలో వరుస కట్టి బయటకు వెళ్లడం కనిపించేది. అంటే ప్రేక్షకుల్లో ఓ నెగిటివ్ ఫీలింగ్ కలిగించడానికి అనుసరించే చీప్ ట్రిక్ అది. తొలి ఆటకే అలాంటి పరిస్థితులు కనిపించినపుడు ఓ హీరో అభిమానులు.. మరో హీరో అభిమానులు తన్నుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

    టెక్నాలజీతో మరింత మోసం..

    టెక్నాలజీతో మరింత మోసం..

    టెక్నాలజీ మొబైల్ ఫోన్ల రూపంలో ప్రేక్షకుడికి, సినీ అభిమానులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. సోషల్ మీడియా ఆసరాతో ఆట పూర్తి కాకుండానే ఓ వర్గం మరో వర్గానికి వ్యతిరేకంగా తమకు తోచిన విధంగా కామెంట్లు పెట్టడం అలవాటుగా మారింది. దాంతో సినిమాలపై ప్రత్యక్షంగా సానుకూలంగానో, లేదా ప్రతికూలంగానో ప్రభావం పడుతున్నదనేది చిత్ర నిర్మాతల వాదన. గతంలోనైతే సినిమా గురించి టాక్ తెలియడానికి కనీసం రెండు రోజైలైనా పట్టేది.

    సమీక్షకుల సంఖ్య

    సమీక్షకుల సంఖ్య

    ఇక సినిమా రివ్యూల విషయానికి వస్తే.. ప్రింట్ మీడియాకే పరిమితం రోజుల్లో సినిమాపైనా సమీక్షలు రాసే వారి సంఖ్యం వేళ్ల మీద లెక్కపెట్టే విధంగా ఉండేది. సినిమా గురించి సమీక్ష వారం తర్వాతనో లేదా పక్షం రోజులకో వెలుగు చూసేది. ఆలోపు ప్రేక్షకుల తీర్పు స్పష్టమయ్యేది. దాని వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోయేవి.

    పుట్టగొడుగుల్లా వెబ్‌సైట్లు..

    పుట్టగొడుగుల్లా వెబ్‌సైట్లు..

    కానీ ప్రస్తుతం వెబ్‌సైట్లు, యాప్‌లు, యూట్యూబ్‌ల పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో సినిమా రివ్యూల వ్యవహారం అదుపుతప్పింది. చేతిలో ఫోనుందా.. ల్యాప్ టాప్ ఉందా సినిమా తొలి ఆట ముగిసిన పది నిమిషాలకు రివ్యూలు పోస్ట్ అవుతున్నాయి. రివ్యూ రాయడం తప్పేమీ కాదు. సినిమా మీద అభిప్రాయం వెల్లడించడం ప్రతి ఒక్కరి హక్కు. కానీ సమీక్షలు నిష్ఫక్షపాతంగా ఉండటం లేదనేది సిని వర్గాల వాదన.

    రేటింగ్ ఎంత ఇవ్వాలి..

    రేటింగ్ ఎంత ఇవ్వాలి..

    ఓ సినిమా విడుదలైతే దాని ఫేట్ సామాజిక వర్గాలపైనే ఆధారపడి ఉంటుంది అనేది ప్రధాన ఆరోపణ. ఇంటర్వెల్‌లోనే రేటింగ్ ఎంత ఇవ్వాలి? అనేది డిసైడ్ అయిపోతుంది. పనిగట్టుకొని ఓ సినిమాకు అనుకూలంగానో లేదా ప్రతికూలంగానో ప్రచారం చేయడం జరుగుతుంది. తమకు నచ్చని సామాజిక వర్గమైతే ప్రతికూలంగా టాక్ వినిపించడం, తక్కువ రేటింగ్‌లు ఇవ్వడం జరుగుతుందని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తాయి. ఇలా సినిమాలకు కులగజ్టి జాడ్యం అంటుకోవడంపై కొందరు బహిరంగంగానే విమర్శలు సంధిస్తున్నారు.

    సమీక్షకులకు బెదిరింపులు

    సమీక్షకులకు బెదిరింపులు

    ఎవరైనా సమీక్షకుడు ఏ సినిమాపైనా రివ్యూలు రాస్తే ఆయా సామాజిక వర్గాల కార్యకర్తలు టార్గెట్ చేసుకోని వారిని బెదిరించడం చాలానే కనిపిస్తున్నాయి. సమీక్షకులు పనిచేసే పత్రికల డెస్క్ నేరుగా ఫోన్ చేసి బెదిరించడం లాంటి సందర్భాలు ఎన్నో. ఇటీవల ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు ఓ సినీ క్రిటిక్‌ను వేలకొద్ది ఫోన్లు చేసి బెదిరించిన విషయం జాతీయ ఛానెళ్ల దృష్టిన కూడా పడింది. ఎవరిది తప్పో అనే విషయం పక్కన పెడితే ఇలాంటి విషయాలు పాత్రికేయులకు కత్తి మీద సామే.

    డీజేతో మొదలై..

    డీజేతో మొదలై..

    ఇటీవల కాలంలో విడుదలైన దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని కూడా సిని రివ్యూల వివాదం చుట్టుముట్టింది. సక్సెస్ మీట్‌లో ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ఓ సమీక్షకుడిని బహిరంగంగానే హెచ్చరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎవడో రాస్తే మా సినిమాకు ఏమౌతుందనే మాటను జారవిడిచాడు సదరు దర్శకుడు. ఆ తర్వాత ఆ వివాదం ఆ సినిమాతోనే ముగిసిపోయింది.

    ఎన్టీఆర్ ఫైర్

    ఎన్టీఆర్ ఫైర్

    ప్రస్తుతం తాజాగా మరోసారి సినీ రివ్యూలపై జూనియర్ ఎన్టీఆర్ సున్నితమైన వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంటుంది అని అంటూనే యంగ్ టైగర్ వార్నింగ్ ఇచ్చారు. సినిమా అనేది ఐసీయూలో చేరిన పేషంట్ లాంటింది. పేషంట్ పరీక్షలు జరిపి ఆరోగ్యంగా ఉందా లేదా అనేది నిర్ణయించేది ప్రేక్షకుల లాంటి డాక్టర్లు అని ఎన్టీఆర్ అన్నారు. ఎవరో కొందరు సినీ విమర్శకులు పనిగట్టుకొని దారిన పోయే దానయ్యలా మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    భవిష్యత్‌లోనూ తప్పవా?

    భవిష్యత్‌లోనూ తప్పవా?

    సినిమా రివ్యూలు సొంత ప్రయోజనాలకు, అభిప్రాయానికి కట్టుబడి ఉన్నంత వరకు ఇలాంటి వివాదాలు రావడం ఆగవు. ఎలాంటి ప్రభావం లేకుండా సమీక్షలు రాయనంత వరకు నిర్మాతలు తమ ఆవేదనను వెల్లడించడం ఆగదు. నిన్న హరీశ్ శంకర్, నేడు ఎన్టీఆర్, రేపు మరోకరు తమ ఆవేదనను, అక్కసును వెల్లగక్కుకునే అవకాశాలు లేకపోలేవు.

    English summary
    Junior NTR is serious over film reviewers on the Jai Lava Kusa success meet. This issues becomes as debate in film circles. There is a allegations that film reviews influenced by cast groups in tollywood. There is a criticism that Jai lava kusa movie effected with some of reviews. Now this contraversy become hot topic in the industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X