చిరంజీవి ఆ దర్శకుడి కి బాధ్యతలు అప్పగించుటలో ఆంతర్యం ఏమిటో...!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చిరు బ్లడ్ బ్యాంక్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ పాల్గొని అభిమానులనుద్దేశించి మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 'చిరంజీవి ఇప్పుడు సినిమాలో నటిస్తానంటే దానికి సంబంధించి ఏర్పాట్లు చేయడానికి మేమంతా సిద్దంగా ఉన్నాం. అభిమానుల అభిరుచికి తగ్గట్టు ఆయన త్వరలోనే నటిస్తున్నట్టు తెలియజేశారు. ఆయన కనుక సినిమా చేస్తానంటే నేను ఆయనతో ఓ భారీ చిత్రం చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు.
ఇదిలావుండగా చిరంజీవి రాజకీయ రంగప్రవేశం తర్వాత తిరిగి నటించబోతున్న సినిమా చిరంజీవి సొంత బ్యానర్ లియో ఇంటర్పేషనల్ నిర్మించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రజనీకాంత్ 'రోబో" ఆడియో ఫంక్షన్ లో తనకు శంకర్ దర్శకత్వంలో చేయాలని ఉందని ప్రకటించిన చిరంజీవి ఇప్పుడు 'కోడి రామకృష్ణ"కు ఆ బాధ్యతలు అప్పగించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ వీరి కలయికలో ఎక్కువ సినిమాలు విజయం సాధించడంతో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అభిమానులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











