చిరంజీవికి ముఖం చాటేసిన స్టార్ ప్రొడ్యూసర్.. అందుకే ప్రభాస్‌తో ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మధ్య సంబంధాలు బలంగా ఉంటాయనేది కాదనలేని వాస్తవం. చిరంజీవితో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించి ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రాలు రూపొందించారు. కానీ వారి మధ్య రిలేషన్స్ ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. అందుకు కారణాలు పలు రకాలుగా మీడియాలో షికారు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

 మహానటి అభినందన సభలో

మహానటి అభినందన సభలో

అశ్వినీదత్‌తో ఉన్న అనుబంధాన్ని దృష్ట్యా మహానటి సినిమాను చిరంజీవి తన బాధ్యతగా ప్రమోట్ చేశాడు. టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేయడమే కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్, ఆయన కూతుళ్లను ప్రశంసలతో ముంచెత్తారు. అలా అశ్వినీదత్ కుటుంబంపై అభిమానాన్ని చిరంజీవి చాటుకొన్నారు.

 చిరంజీవి ఓకే అంటే స్పేస్ సినిమా

చిరంజీవి ఓకే అంటే స్పేస్ సినిమా

మహానటి అభినందన కార్యక్రమంలోనే చిరంజీవితో స్పేస్ రిలేట్ సినిమా తీయాలనుందనే కోరికను అశ్వినీదత్, నాగ అశ్విన్ బయటపెట్టడం, అందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించడంతో గొప్ప ప్రాజెక్ట్‌ను అభిమానులు, సినీ ప్రేక్షకులు చూడబోతున్నారనే విషయం ఆనందం కలిగించింది.

ప్రభాస్‌తో వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్

ప్రభాస్‌తో వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్

ఇలా చిరంజీవి, నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ తగిలింది. వైజయంతి మూవీస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ను అశ్వినీదత్ అనౌన్స్ చేశారు. దాంతో చిరంజీవితో సినిమా ఏమైందనే చర్చ మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌ను చిరంజీవి వదులుకోవడం వెనుక అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

 చిరంజీవి చొరవ తీసుకొని

చిరంజీవి చొరవ తీసుకొని

కాగా, ఇటీవల చిరంజీవి, అశ్వినీదత్ మధ్య ప్రాజెక్ట్ సెట్ చేసే విషయంలో కుదర్లేదనేది తాజా సమాచారం. అంతేకాకుండా పలుమార్లు చిరంజీవి చొరవ తీసుకొన్నప్పటికీ.. అశ్వినీదత్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదనేది మరో కారణమని తెలుస్తున్నది. అందుకే నాగ్ అశ్విన్‌తో చిరంజీవి సినిమాను చేయడం ఇష్టపడలేదని, ఈ క్రమంలోనే మెగాస్టార్ స్వయంగా స్పేస్ రిలేటెడ్ కథను ప్రభాస్‌కు పంపించడం జరిగిందనే వార్త ప్రచారంలో ఉంది.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin To Direct Prabhas | Vyjayanthi Movies || Filmibeat Telugu
 తాత్కాలికంగా దూరంగా

తాత్కాలికంగా దూరంగా

ఏది ఏమైనా చిరంజీవి, వైజయంతి మూవీస్ బ్యానర్ కాంబినేషన్‌లో మరో జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాను ఆశించిన అభిమానులకు కొంత షాకే తగిలింది. అయితే నాగ్ అశ్విన్, చిరంజీవి మధ్య సినిమా ఉంటుందా? ఇక వైజయంతితో అనుబంధానికి తాత్కాలికంగా పుల్‌స్టాప్ పడిందా? అనే ప్రశ్నలు మీడియాలో వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X