twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi బాలయ్య మధ్య కోల్డ్ వార్?.. సీఎం జగన్‌తో మీటింగ్.. చర్చలో కనిపించని బాలకృష్ణ

    |

    కరోనావైరస్ వ్యాప్తి వల్ల షూటింగులు, ఇతర కార్యక్రమాలు స్తంభించడంతో తెలుగు సినిమా పరిశ్రమ పలు రకాల సమస్యల్లో కూరుకుపోయింది. అయితే ఆ సమస్య కారణంగా పలు భారీ బడ్జెట్, అలాగే అగ్ర హీరోల సినిమాలు రిలీజ్‌కు నోచులేకపోతున్నాయి. అయితే గత ఏడాది కాలంగా ప్రభుత్వాలను చిరంజీవి నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఇబ్బందులను, సమస్యలను చెప్పుకొని వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి, బాలకృష్ణ మధ్య భారీ చిచ్చును రేపింది. ఆ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

    Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    గతంలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

    గతంలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

    గతంలో సీఎం కేసీఆర్‌, వైఎస్ జగన్‌ను తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన అగ్ర నటులు, నిర్మాతలు కలిశారు. ఆ బృందంలో చిరంజీవి, నాగార్జున అక్కినేని లాంటి వాళ్లతో పాటు నిర్మాత సురేష్ బాబు తదితరులు కనిపించారు. ఆ మీటింగ్‌కు వెళ్లిన వారిలో నందమూరి బాలకృష్ణ కనిపించడకపోవడం ఆసక్తిని రేపింది. అయితే ఆ సమయంలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించాయి.

    నన్ను పిలువలేదంటూ బాలయ్య

    నన్ను పిలువలేదంటూ బాలయ్య

    సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎందుకు వెళ్లలేదని బాలకృష్ణను అడిగితే.. నాకు పిలుపు రాలేదు. సీఎంను కలిసిన వారిలో కొందరు భూములు అడుక్కొనేందుకు వెళ్లారు. వాళ్లలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేసి బాలకృష్ణ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యమంత్రులతో సమావేశానికి తనకు ఎలాంటి పిలుపు రాలేదు. ఆ భేటీల గురించి నేను మీడియాలో చూసి తెలుసుకొన్నాను. నేను ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తినా అంటూ బాలకృష్ణ నిలదీశారు.

    Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!

    మా కుటుంబం నుంచి ఎవర్నీ పిలువలేదంటూ

    మా కుటుంబం నుంచి ఎవర్నీ పిలువలేదంటూ

    రాజకీయాల్లో ఎమ్మెల్యేగా రాణిస్తున్నాను. సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ప్రతిష్ట, గౌరవాలు ఉన్నాయి. అలాంటి మా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఉన్నారు. అందులో ఎవరినీ ఆహ్వానించకపోవడం చాలా విచారకరం. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా సినీ పరిశ్రమకు ఎన్నో విషయాల్లో అండగా నిలిచాం. వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్దికి చర్యలు తీసుకొన్నాం అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

    నాగబాబు ఫైర్.. క్షమాపణ చెప్పాలంటూ

    నాగబాబు ఫైర్.. క్షమాపణ చెప్పాలంటూ

    అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మెగా బ్రదర్ నాగబాబు తప్పుపట్టారు. బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ బాగోగుల గురించి పట్టించుకొని ముఖ్యమంత్రిని కలిస్తే.. వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా బాలకృష్ణ మాట్లాడారు. ఈ విషయంలో ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి అంటూ నాగబాబు డిమాండ్ చేశారు. అయితే నాగబాబు చేసిన డిమాండ్‌పై బాలకృష్ణ స్పందించకపొవడంతో ఆ వివాదం ఆ తర్వాత సద్దుమణిగింది.

    ఏపీ సీఎంతో చర్చలకు టాలీవుడ్.. కనిపించని బాలయ్య

    ఏపీ సీఎంతో చర్చలకు టాలీవుడ్.. కనిపించని బాలయ్య

    ఇక తాజాగా సినీ పరిశ్రమలో సమస్యలను ఏపీ సర్కారు, సీఎం వైఎస్ జగన్‌తో చర్చించేందుకు చిరంజీవి అపాయింట్‌మెంట్ కోరారు. అందుకు ఏపీ సర్కారు కూడా సానుకూలంగా స్పందించింది. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలను చర్చించాలనే విషయంపై చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు ఆగస్టు 16న సమావేశమయ్యారు. అయితే అందులో కూడా బాలకృష్ణ కనిపించకపోవడంతో మళ్లీ ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    మా ఎన్నికలతో రచ్చ.. అగ్ర నటుల మధ్య కోల్డ్ వార్

    మా ఎన్నికలతో రచ్చ.. అగ్ర నటుల మధ్య కోల్డ్ వార్

    దీంతో సినీ పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ నడస్తున్నదనే ఊహగానాలకు బలం చేకూరేలా చేసింది. కేవలం సినిమా పరిశ్రమలోని సమస్యలపై అగ్ర నటుల మధ్య విభేదాలు నెలకొన్నాయనే విషయం వారి మాటల్లోనే స్పష్టమైంది. మా ఎన్నికల వ్యవహారం కూడా చిరంజీవి, బాలయ్య మధ్య సంబంధాలను మరింత దూరం చేసేలా చేసింది.

    గతంలో మా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఆ సంస్థకు బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? ఒకవేళ ఎవరైనా ముందకు వస్తే భవన నిర్మాణానికి తాను ఆర్థిక సహాయం అందిస్తాను అని బాలయ్య చెప్పడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులతో బాలయ్య, చిరంజీవి వర్గాలు అనే మాట మీడియాలోనే కాకుండా సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

    English summary
    Tollywood Industries big wigs are ready to discuss with AP CM YS Jagan. Befor this meeting, Chiranjeevi, producer and distibutors met on August 16. But Balakrishna was away from the meeting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X