నటుడిగా మారుతున్న దేవిశ్రీ ప్రసాద్, శ్రీయతో రొమాన్స్!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ స్పందిస్తూ....నటనపై ఆసక్తి ఉందని, నటిస్తే శ్రీయతో చేయాలని ఉందని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో, దేవిశ్రీ తనలోని నటుడిని ఏ సినిమా ద్వారా బయట పెడతారో చూడాలి. గబ్బర్ సింగ్, జులాయి, డమరుకం చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు.
ప్రస్తుతం దేవిశ్రీ...రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు', 'జంజీర్', ప్రభాస్ హీరోగా వస్తున్న 'మిర్చి', మహేష్-సుకుమార్ మూవీకి, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'ఇద్దరమ్మాయిలతో', రవితేజ 'సార్ వస్తారు', నాగార్జున 'భాయ్', పవన్ కళ్యాణ్-తివిక్రమ్ మూవీకి, తమిళంలో అలెక్స్ పాండ్యన్, సింగం 2 చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.
హీరోయిన్ శ్రీయ ప్రస్తుతం 'చంద్ర' అనే కన్నడ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆమె రాజకుమారిగా 'మహారాణి అమ్మన్ మణి చంద్రావతి' పాత్రలో నటిస్తోంది. వయసు పెరుగుతున్నా కూడా నవనవలాడే సౌందర్యాన్ని కోల్పోని శ్రియ ఈచిత్రంలో మరింత గ్లామరస్‌గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications












