పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు సీక్రెట్ ఎజెండా.. రంగంలోకి రాంచరణ్.. ఏ క్షణంలోనైనా..
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలువురు నిర్మాతలు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు కాకుండా కొత్తగా మరికొందరి నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి. సైరా జోష్‌తో పవన్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే తాజాగా పవన్‌తో సినిమా తీయడానికి రాంచరణ్, దిల్ రాజు పేర్లు తెరపైకి రావడంతో మరింత ఆసక్తిని రేపుతున్నది. ఇంతకు పవన్ రీ ఎంట్రీపై సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇదే..

ఏ క్షణంలోనైనా సినిమాల్లోకి
పవన్ కల్యాణ్ ఏ క్షణంలోనైనా సినిమాల్లో నటించే నిర్ణయాన్ని తీసుకోనున్నారనే వార్తతో టాప్ ప్రొడ్యూసర్స్ ముందే సర్దుకొంటున్నట్టు సమాచారం. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగినట్టు తెలిసింది. పవన్‌ను తన బ్యానర్‌లో మూవీ చేయమని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. రాంచరణ్‌తో కూడా దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

రాంచరణ్‌తో చర్చలు
అయితే బాబాయ్ పవన్ కల్యాణ్‌తో కూడా రాంచరణ్ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచనతో ఉండటంతో ఇద్దరు కలిసి సినిమా చేస్తారా అనే కోణంలో కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే పవన్ కల్యాణ్ సినిమా చేస్తే వీరితో చేస్తారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. కానీ అది సాధ్యపడుతుందా అనే విషయం కూడా చర్చల్లో వస్తున్నది.

ఆ ఇద్దరి నిర్మాతల పరిస్థితి
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే మైత్రీ మూవీస్, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం వద్ద అడ్వాన్సులు తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికల తర్వాత మైత్రీకి, ఏఎం రత్నంకు సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టు పలు కథనాలు వెలుగు చూశాయి. అయితే వారిద్దరికి కాకుండా రాంచరణ్, దిల్ రాజుకు సినిమా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని అంచనా వేస్తున్నారు.

పాలిటిక్స్, సినిమా బ్యాలెన్స్‌తో
ఇక టాలీవుడ్ ఎంట్రీపై పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి క్లారిటీ వెలువడకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీల నుంచి విమర్శలు రాకుండా మూవీ ఎంట్రీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే పాలిటిక్స్‌ను, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ ఉండేలా కార్యాచరణను పార్టీ వర్గాలు సిద్దం చేస్తున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











