twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూలకు భయపడి కథ మార్చేసిన దిల్ రాజు, హరీశ్.. అయినా ఫెయిల్యూరే..

    దువ్వాడ జగన్నాథం చిత్రం దిల్ రాజు కెరీర్‌లో 25వది. ఈ సందర్భంగా నిర్మాతగా సుదీర్ఘమైన కెరీర్‌తో దూసుకెళ్తున్న దిల్ రాజు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడారు.

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో దమ్ము, ధైర్యం ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. సినిమాలో విషయంలో ఆయనకు జడ్జిమెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆయనకు 80 శాతం విజయాలు దక్కాయి. ఆయన నిర్మించిన దువ్వాడ జగన్నాథం చిత్రం ఆయన కెరీర్‌లో 25వది. ఈ సందర్భంగా నిర్మాతగా సుదీర్ఘమైన కెరీర్‌తో దూసుకెళ్తున్న దిల్ రాజు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడారు. ఆయన జీవితంలో చోటుచేసుకొన్న అంశాలు, ఎదురైన సమస్యలను మీడియాతో పంచుకొన్నారు. రెబల్ చిత్రం కారణంగా ఓ చిత్రానికి సంబంధించిన కథ మార్చేశామని ఆయన వెల్లడించారు. అదేమిటంటే..

    ఫెయిల్యూర్‌కు బాధ్యత నాదే

    ఫెయిల్యూర్‌కు బాధ్యత నాదే

    నేను నిర్మించిన 25 చిత్రాల్లో దాదాపు ఆరు చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ వాటివల్ల నష్టపోలేదు. విజయాలతోపాటు ఫ్లాపులకు కూడా నేను బాధ్యత వహిస్తాను. కథ విని నేను ఒప్పుకోవడం వల్లే ఏ సినిమా అయినా ముందుకెళ్తుంది. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అందులో నా బాధ్యత కూడా ఉంటుంది. సక్సెస్‌లో కంటే ఫెయిల్యూర్‌లోనే నా పాత్ర ఎక్కువ ఉంటుంది.

    సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే

    సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే

    నేను నిర్మించిన చిత్రాల్లో ఫెయిల్ అయిన వాటిలో సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉండేవి. కొన్ని అవకాశాలను సరిగా వినియోగించుకోక పోవడం వల్లే అవి ఫెయిల్ అయ్యాయి. నిర్ణయం తీసుకొనే కొందరు వ్యక్తుల సరిగా స్పందించకపోవడంతో అది జరిగి ఉంటుందని అనుకొంటున్నాను.

    అవి సక్సెస్ అయ్యే ఛాన్స్

    అవి సక్సెస్ అయ్యే ఛాన్స్

    ఆశించిన ఫలితాలు రాబట్టలేని ఆరు చిత్రాల్లో మూడు సినిమాలు డెఫినెట్‌గా సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉండేవి. వాటిలో రామరామ కృష్ణ, మున్నా, రామయ్య వస్తావయ్యా ఉన్నాయి. వాటిపై కాస్త దృష్టిపెట్టి ఉంటే సక్సెస్ అయ్యేవనే ఫీలింగ్ ఇప్పటికి ఉంది.

    రెబల్ దెబ్బ తీసింది..

    రెబల్ దెబ్బ తీసింది..

    రామయ్య వస్తావయ్య చిత్రం విషయానికి వస్తే టైమ్ సరిగా లేకపోవడమే. రెబల్ సినిమా రిలీజ్ కాకముందు రామయ్య వస్తావయ్య కథ వేరు. ముందు ఒక కథ అనుకొని ఎన్టీఆర్, హరీశ్ శంకర్, నేను సినిమా తీయాలనుకొన్నాం. రెబల్ వచ్చిన తండ్రి మీద కొడుకు రివేంజ్ తీసుకోవడం బాగుండదు అనుకొని కథ మార్చేశాం. హరీశ్ మళ్లీ కథ మీద వర్క్ చేసి కొత్త కథ చెబితే సరే అనుకొని ముందుకెళ్లాం.

    రివ్యూలకు భయపడి కథ మార్చేశాం..

    రివ్యూలకు భయపడి కథ మార్చేశాం..

    ముందు అనుకొన్న కథ ప్రకారం సినిమా తీస్తే.. ఆ సినిమా రిలీజ్ తర్వాత రెబల్ లాగా ఉందని రివ్యూలు వస్తాయని వెనుకడుగు వేశాం. కథ మార్చడం వల్ల పెద్ద తప్పు చేశాం. రివ్యూలను పక్కన పెడితే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్తేది. రామయ్య వస్తావయ్యా సినిమా ఫ్లాఫ్ అందరికి చెందుతుంది.

    రాముడు, కృష్ణుడు పేర్లు..

    రాముడు, కృష్ణుడు పేర్లు..

    రాముడు, కృష్ణుడు పేర్లతో వచ్చిన సినిమాలు నాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. రామ రామ కృష్ణ కృష్ణ, రామయ్య వస్తావయ్యా, కృష్ణాష్టమి సినిమాలు విజయం సాధించలేదు. సహజంగా మేము వెంకటేశ్వరస్వామి భక్తులం. మా బ్యానర్‌ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. నేను ఉన్నాకా రాముడు, కృష్ణుడు పేర్లు ఎందుకు పెట్టుకొన్నావని వెంకటేశ్వరస్వామి కోపగించుకొన్నాడేమో అని దిల్ రాజు చమత్కరించారు.

    English summary
    As a producer, Duvvada Jagannadham is 25th film for Dil Raju. In a long career Dil Raju gets 80 percent success. He said becuase of Rebel, He changed Ramaiah Vastavaiah story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X