For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రగ్స్ కేసులో పూరీ కంపెనీయే టార్గెట్.. తప్పించిన ఆ 10 మంది ఎవరు? అసలేం జరుగుతున్నది

  By Rajababu
  |

  తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ మాఫియా వ్యవహారం కుదిపేస్తున్నది. అన్ని వర్గాలను ఆశ్చర్యపరిచే విధంగా సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం చర్చనీయాంశమైంది. వెండితెర వేల్పులుగా కొలువబడే నటుల తెర వెనుక జీవితం ఇంత దారుణంగా ఉంటుందా అనే పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై నీతుల చెప్పే సినీ నటులు ఈ విధంగా ప్రవర్తిస్తే సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తారనే వాదన వినిపిస్తున్నది. అయితే డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో కేవలం దర్శకుడు పూరి జగన్నాథ్ వర్గమే టార్గెట్ కావడంపై మరో చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా ఓ పదిమంది నటులను ఈ జాబితా నుంచి తప్పించారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

  కెల్విన్ అరెస్ట్‌తో తారల పేర్లు తెరపైకి

  కెల్విన్ అరెస్ట్‌తో తారల పేర్లు తెరపైకి

  డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ అరెస్ట్‌తో ఒక్కసారిగా తెలుగు సినీ ప్రముఖుల పేర్లు మీడియాలో సంచలనంగా మారాయి. పోలీసులు నోటీసులు అందించిన సినీ నటులు జాబితాలో పూరీ జగన్నాథ్, రవితేజ, సుబ్బరాజు, చార్మీ తదితరులు ఉన్నారు. వీరంతా పూరీకి సన్నిహితులే. పూరీ నిర్వహించే విందులు, వినోదాల జోరులో వీరే ఎక్కువగా కనిపిస్తారు.

  Drugs Scandal : Actor Nandu Emotional Convince about his Drug Addicted Issue
  పూరీ కంపెనీలోని వారి పేర్లే

  పూరీ కంపెనీలోని వారి పేర్లే

  కష్టాల్లో ఉన్న స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్లు అందిచండంతో పూరీ సినిమాలు టాలీవుడ్‌లో ట్రేడ్ మార్క్‌గా నిలిచారు. ఆయన వెంట ఎప్పుడూ ఓ కోటరి ఉంటుంది. పూరీ మేకింగ్‌లోనే కాదు.. తన లైఫ్ స్టయిల్ కూడా పాశ్చాత్య జీవితానికి దగ్గరగా ఉంటుంది. బ్యాంకాక్, థాయ్‌లాండ్ ఆయనకు కేరాఫ్ అడ్డా. ఆ ప్రాంతాల్లో పూరీకి ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పుకొంటారు. తాజాగా డ్రగ్స్ కేసులో లిస్టవుటయిన పేర్లన్నీ పూరి కంపెనీలోని వారివి కావడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.

  గిట్టనివాళ్లు చేస్తున్న ప్రచారమే.. చార్మీ

  గిట్టనివాళ్లు చేస్తున్న ప్రచారమే.. చార్మీ

  ఇటీవల సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్న సినీ నటి చార్మీ, ముమైత్ ఖాన్ పేరు డ్రగ్స్ కేసులో బయటపడటం సంచలనంగా మారింది. పూరీ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ చిత్రంలో చార్మీ హీరోయిన్. అప్పటి నుంచి పూరీకి అతిసన్నిహితంగా మెలుగుతున్నది. ఈ నేపథ్యంలో తనపై ఆరోపణలు రావడంపై ఛార్మీ ఖండించింది. ఉన్నత స్థానంలో ఉన్న తనను కొందరు గిట్టని వాళ్లు కిందికి లాగడానికి చేస్తున్న ప్రయత్నమని ఆమె వివరణ ఇచ్చుకొన్నది. ప్రొడ్యూసర్‌గా కొత్త కెరీర్ ప్రారంభించిదనుకున్న సమయంలో డ్రగ్స్ కేసులో చార్మీ పేరు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  నమ్ముకొని వస్తే ఇలానా.. ముమైత్

  నమ్ముకొని వస్తే ఇలానా.. ముమైత్

  సెక్స్ బాంబ్ ముమైత్ ఖాన్ పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన ఐటమే. ఓ దశలో ముమైత్ ఖాన్ జోరు బాగానే నడించింది. ప్రస్తుతం ఆమె తెలుగు తెరమీద కనిపించడం చాలా అరుదుగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఈ జాబితాలోకి రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, టాలీవుడ్‌ను నమ్ముకొని వస్తే ఇలా ఆరోపణలు చేస్తారా అంటూ ముమైత్ దీర్ఘాలు తీసింది.

  వదిలేసిన ఆ పదిమంది ఎవరు

  వదిలేసిన ఆ పదిమంది ఎవరు

  ఇక ఈ జాబితాలో కొందరు ప్రముఖుల పేర్లు కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమలో పలుకుబడి ఉన్న పెద్దలకు సంబంధించిన వారిని ఉద్దేశపూర్వకంగా తప్పించారనే ఆరోపణలు జోరందుకున్నాయి. హైదరాబాద్ నగర ప్రతిష్ఠకు మచ్చగా మారిన డ్రగ్స్ వ్యవహారంలో కూడా రాజకీయాలు చేస్తారా అంటూ పలువురు నిలదీస్తున్నారు. ఏది ఏమైనా డ్రగ్స్ మహమ్మారి స్కూళ్లకు పాకడం అందరూ ఆందోళన చెందాల్సిన అంశమేననే వాదన వినిపిస్తున్నది.

  English summary
  Telangana Prohibition and Excise Department issued notices to some Tollywood personalities. In this Drug case Director Puri Jagannadh's company is being targeted. There some allegations that few of influential actors are escaped from the list. In this juncture Movie Artists Association (MAA) members responded to media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X