స్టార్ హీరోతో నిర్మాత డివివి దానయ్య విభేదాలు... ఆ బిగ్ ప్రాజెక్ట్‌కు బ్రేక్
స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోతో డైరెక్టర్ విషయంలో జరిగిన గొడవ కారణంగా అతనితో దానయ్య చేయబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు బ్రేక్ పడినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దానయ్య, హీరో మధ్య గొడవకు సదరు డైరెక్టర్ ఎలా కారణమయ్యాడు? ఇంతకీ ఏ ప్రాజెక్టుకి బ్రేక్ పడింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కెద్దాం.
ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ అవార్డును అందుకున్న ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్ తో దానయ్య చేయబోతున్న ప్రాజెక్టు గురించి పాన్ ఇండియా సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో విజయ్ చేయబోయే ఆఖరి మూవీ ఇదే అవుతుందని ప్రచారం జరగడంతో ప్రాజెక్ట్ కనీసం స్టార్ట్ కాకముందే హైప్ మాత్రం ఆకాశాన్ని తాకింది. దానయ్య నిర్మాతగా, విజయ్ హీరోగా ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. కానీ డైరెక్టర్ గురించి వేట మాత్రం చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతూ వస్తోంది.

మరోవైపు వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ గోట్ సినిమా చేస్తున్నాడు. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, జూన్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే విజయ్, దానయ్య సినిమాను పట్టాలెక్కించబోతున్నాడని టాక్ నడుస్తోంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈ సినిమా ఆగిపోయిందని ఇన్సైడ్ టాక్.
దానికి కారణం రెమ్యూనరేషన్ అని కొందరు అంటే, డైరెక్టరే కారణం అని మరికొందరు అంటున్నారు. విజయ్ దానయ్య కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ కు నిన్న మొన్నటి దాకా జిగర్తాండ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తాడని రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత ఖాకీ, వలిమై లాంటి సినిమాలు రూపొందించిన డైరెక్టర్ హెచ్ వినోద్ పేరు తెరపైకి వచ్చింది. అయితే సమస్య ఇక్కడే మొదలైందని తెలుస్తోంది.

విజయ్ ఈ సినిమా కోసం ఏకంగా 250 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారు. అయినప్పటికీ విజయ్ కు సౌత్ లో ఉన్న మార్కెట్ దృష్ట్యా దానయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ డైరెక్టర్ విషయంలోనే వీరిద్దరూ ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ హెచ్ వినోద్ కు ఒక్క కోలీవుడ్ లో మినహా మిగతా భాషల్లో పెద్దగా మార్కెట్ లేదు. కాబట్టి అతనిని నమ్మి సినిమాపై 400 కోట్లు పెట్టలేనని, వినోద్ తో మూవీ చేస్తే బిజినెస్ వర్కౌట్ కాదని దానయ్య కుండబద్దలు కొట్టారట.
కానీ విజయ్ మాత్రం వినోద్ తో మూవీకే మొండి పట్టు పట్టారట. అయితే ఎవరైనా తెలుగు స్టార్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తే తెలుగు మార్కెట్ కు ఎలాంటి సమస్య ఉండదు. ఇక తమిళం విషయానికి వస్తే అక్కడ విజయ్ కు ఎలాగూ మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి డైరెక్టర్ ఎవరైనా పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది దానయ్య ఆలోచన. కానీ డైరెక్టర్ విషయంలో విజయ్, దానయ్య మధ్య నెలకొన్న విభేదాల కారణంగా తాను ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేయలేనంటూ దానయ్య చేతులెత్తేశారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











