మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు, కొట్టుకున్న మోహన్‌బాబు - మనోజ్? .. నిజమెంత?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు మోహన్ బాబు‌ ఫ్యామిలీ కూడా ఒకటి. నటుడిగా, నిర్మాతగా దాదాపు ఐదు దశాబ్ధాలుగా టాలీవుడ్‌‌పై చెరగని ముద్ర వేశారు మోహన్ బాబు. ఆయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. వీరి కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నప్ప చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే గత కొద్దినెలలుగా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నదమ్ములిద్దరికీ పడటం లేదని.. మోహన్ బాబు కూడా చిన్న కొడుకు మనోజ్‌తో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని ఫిలింనగర్ టాక్. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా విష్ణు ఏదో గెస్ట్ మాదిరిగా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కొద్దిరోజులకే విష్ణు తన అనుచరులు, బంధువులతో గొడవ పడుతున్నాడంటూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.

is fight between Manchu mohan babu and manoj babu

ఈ వీడియో చిత్ర సీమలో దుమారం రేపగా.. మోహన్ బాబు, తదితర పెద్దలు రంగంలోకి దిగడంతో అన్నదమ్ముల మధ్య రాజీ కుదిరిందని, తర్వాత వీడియోను మనోజ్ తొలగించారని అంటారు. అయితే అప్పటికే మంచు కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతానికి అక్క మంచు లక్ష్మీతోనే మనోజ్ క్లోజ్‌గా ఉంటున్నాడు. ఏం జరిగినా , ఏ కష్టమొచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మనోజ.. భార్యాబిడ్డలతో గడిపేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాడు.

మరోవైపు.. ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్పలో నటిస్తున్నాడు. మైథలాజికల్ ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ప్రభాస్ తదితరులు నటిస్తుండగా.. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. మోహన్ బాబు సినీనటుడిగా 50 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కన్నప్పలో ఆయన లుక్‌ని రివీల్ చేశారు. ఇందులో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటిస్తున్నారు.

ఇక దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని పెళ్లాడిన మంచు మనోజ్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు మౌనిక జన్మనిచ్చారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్‌ అనే సినిమాలో మనోజ్ నటిస్తుండగా.. ఇందులో నిహారిక కొణిదెల కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి దశలో మోహన్ బాబు - మనోజ్‌ల మధ్య గొడవ జరిగినట్లు ఇద్దరూ కొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

తనపై , తన భార్య మౌనికపై తన తండ్రి మోహన్ బాబు దాడి చేశాడని.. మనోజ్ ఈ ఫిర్యాదులో పేర్కొనగా.. మనోజ్ తనపై దాడి చేసినట్లుగా మోహన్ బాబు మరో ఫిర్యాదును పోలీసులకు ఇచ్చినట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆస్తి పంపకాలతో పాటు మంచు ఫ్యామిలీకి సంబంధించిన విద్యాసంస్థల వ్యవహారాలతోనే తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ కాసేపటికే మంచు ఫ్యామిలీ స్పందించింది. మోహన్ బాబు- మనోజ్‌ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని మీడియాలో వస్తున్న కథనాలు అసత్యాలేనంటూ క్లారిటీ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X