గబ్బర్‌సింగ్ ఆడియోకి చీఫ్‌గా జూ ఎన్టీఆర్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఆడియో వేడుకకు జూ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. అంతేకాకుండా గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్న బండ్ల గణేష్....మరో వైపు శ్రీను వైట్ల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన బాద్ షా షూటింగ్ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ హాజరు కావడం వెనక పవన్ కళ్యాణ్ సిఫారసు ఉందనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు జూ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రావడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో, హీరోయిన్ శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి భాగ్యలక్ష్మి పాత్రలో కనిపించనుంది. బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











