రికార్డులు బద్దాలా..? ‘గబ్బర్ సింగ్’ సత్తా ఎంత?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికు వరకు నమోదైన బ్రహ్మాండమైన రికార్డులను బద్దలు కొట్టే దిశగా సాగుతోంది. సినిమాలో అసలు బోరింగ్ అనేదే లాకుండా ఫూర్తి ఎంటర్‌టైన్మెంట్‌తో కూడుకుని ఉండటమే ఇందుకు కారణం.
గతంలో వచ్చిన మహేష్ బాబు బిజినెస్ మేన్, జూనియర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రంతో పోల్చుకుంటే 'గబ్బర్ సింగ్' చిత్రానికి ధియేటర్లు తక్కువగానే కేటాయించ బడ్డాయి. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుందా? లేదా? అని ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే ప్రేక్షకుల స్పందన పరంగా చూసుకుంటే సినిమా 50, 100 రోజుల పండగ ఎక్కువ థియేటర్లలో జరుపుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రికార్డుల విషయమై దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...నేను పవన్ అభిమానులకు ఒకటే చెబుతాను. మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన గబ్బర్ సింగ్ సినిమా కోసం చూడండి. పవన్ కోసం చూడండి. రికార్డులు ఆశించి చూడకండి అంటున్నారు. అలాగే..వెయ్యి థియేటర్లు, ఫస్ట్ వీక్ రికార్డులు, కలెక్షన్లు అన్నట్లు మా గబ్బర్ సింగ్ చిత్రం చూడొద్దు. సినిమా రికార్డులు అన్నవి వివిధ పరిస్థితులపై ఆధారపడి వుంటాయి. మరే సినిమాలు లేకపోవడం, థియేటర్ల అందుబాటు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి అన్నారు.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











