ఇలియానాకు షాకిచ్చిన టాలీవుడ్ హీరో..
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో గోపిచంద్ ప్రస్తుతం భారీ సక్సెస్‌ను అందుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం అందివచ్చే ఒక్క ఛాన్స్‌ను కూడా వదులుకొనే పరిస్థితిలో లేడు. కథ, కథనాలే కాదు, హీరోయిన్ ఎంపికపై కూడా కచ్చితంగా వ్యవహరిస్తున్నాడనే తాజా సమాచారం. ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంపిక చేసిన హీరోయిన్‌ను రిజెక్ట్ చేశాడట. వివరాల్లోకి వెళితే...

ఇలియానాతో ఇప్పటి వరకు
గోపిచంద్ తన కెరీర్‌లో క్రేజీ హీరోయిన్లతో పనిచేశాడు. శౌర్యంలో అనుష్క, సాక్ష్యంలో త్రిషా, సాహసంలో తాప్సీ పన్ను, లౌక్యంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి నటించాడు. కానీ ఇప్పటివరకు ఇలియానాతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోలేదు.

ఇలియానా రీ ఎంట్రీతో
ఇక ఇలియానా చాలా రోజులు టాలీవుడ్‌కు దూరమై అమర్ అక్బర్ ఆంథోనితో రీఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా నవంబర్ 16న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇలియానా టాలీవుడ్‌లో హాట్ టాపికైంది. అయితే గోపిచంద్‌తో ఇలియానాను నటింపజేసి క్రేజీ జంటగా మారుద్దామని చిత్ర యూనిట్ ప్లాన్ వేసింది.
ఇలియానాకు అంతగా క్రేజ్ లేదు. ఆమెను తీసుకోవద్దు. టాలీవుడ్‌కు ఆమెకు బాగా గ్యాప్ వచ్చింది అని గోపిచంద్ డిసైడ్ చేశారట. దాంతో మరో హీరోయిన్ వేటల పడినట్టు సమాచారం.

బడా హీరోలతో ఇలియానా
ఇలియానాతో బడా హీరోలు నటించడానికి ముందుకు రావడం లేదు. ఈ సినిమాకు ముందు పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి వారి పక్కన నటించే విషయంపై చర్చలు జరిగినా.. అవి కొలిక్కి రాలేదు. దాంతో ఇలియానాకు బిగ్ ఆఫర్లు కరువయ్యాయి. ఒకవేళ అమర్ అక్బర్ ఆంథోని రిలీజై విజయం సాధిస్తే మళ్లీ ఈ గోవా బ్యూటీ వెలుగు వెలిగే అవకాశం ఉంది.

ఇలియానా నా డార్లింగ్ అంటూ
ఇటీవల అమర్ అక్బర్ ఆంథోని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. ఇలియానా నా డార్లింగ్. అవకాశం వస్తే ఆమెతో మళ్లీ మళ్లీ నటిస్తాను. నాకు నచ్చిన హీరోయిన్ అంటూ రవితేజ తన ఇష్టాన్ని చాటుకొన్న సంగతి తెలిసిందే. ఇలా హీరోలు పక్కన పెడుతుంటే మాస్ మహారాజ్ వెనుకేసుకురావడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











