twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్కడి రివ్యూకు హరీశ్ భయపడ్డాడా? అందుకే మాటల దాడా?

    దువ్వాడ జగన్నాథం దర్శకుడు హరీశ్ శంకర్ సినీ విమర్శకు(డు)లపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినిమాను డిసైడ్ చేయడానికి నువ్వెవడివి అంటూ బహిరంగ వేదికలపై ఒళ్లు మరిచి వ్యాఖ్యలు చేయడం ఏదో

    By Rajababu
    |

    దువ్వాడ జగన్నాథం దర్శకుడు హరీశ్ శంకర్ సినీ విమర్శకు(డు)లపై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినిమాను డిసైడ్ చేయడానికి నువ్వెవడివి అంటూ బహిరంగ వేదికలపై ఒళ్లు మరిచి వ్యాఖ్యలు చేయడం ఏదో అహంకారం కనబడిందనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉందని తెలిసిన దర్శకుడు హరీశ్ శంకర్ తన అభిప్రాయాన్ని చెప్పిన సినీ విమర్శకుడు, క్రిటిక్స్‌పై నోటి దురుసు ప్రదర్శించడం ఎంతమాత్రం సమంజసనీయం కాదనే వాదన వినిపిస్తున్నది.

    బాగా లేదంటే..

    బాగా లేదంటే..

    మీరు తీసిన సినిమా బాగాలేదని, కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పిన పాపానికి సినీ విమర్శకులు సమాజ వ్యతిరేక శక్తులుగా మీకు కనిపించారా? నోరు, బలం ఉంది కదా అని మైక్ పట్టుకొని నాలుగు మాటలు గాల్లోకి వదిలి చప్పట్లు కొట్టించుకోవడం సమంజసమేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

    మాటల దాడిపై సమంజసం కాదు..

    మాటల దాడిపై సమంజసం కాదు..

    సినీ విమర్శకులపై మాటల దాడి చేయడాన్ని సినీ వర్గాలే తప్పుపడుతున్నాయి. మీ సినిమా బాగా ఉందని రాసినప్పుడు సంకలు గుద్దుకున్న మీరు.. బాగా లేదని చెప్పినప్పుడు జీర్ణించుకోలేరా అనే నిలదీస్తున్నారు. సినీ విమర్శకులంటే మీకు బాకా ఊదాలా? వారికి ఓ అభిప్రాయం ఉండదా? అనే వాదనను బలంగా వినిపిస్తున్నారు.

    శకునాలు చెప్పే బల్లి

    శకునాలు చెప్పే బల్లి

    వేదిక మీద అన్నీ నీతులు చెప్పిన హరీశ్ శంకర్ తీరు.. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడినట్టు ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. శాస్త్రాలు, వేదాలు తెలిసిన బ్రహ్మణుడినని చెప్పుకొనే హరీశ్ శంకరాచార్యులు.. వేదికల మీద వాడు .. వీడు అనే పదాన్ని ఉపయోగించొద్దనే ఇంగిత జ్ఞానం ఆయనకు లేదా అనే మాట వినిపిస్తున్నారు.

    అదుపు తప్పిన హరీశ్ నాలిక..

    అదుపు తప్పిన హరీశ్ నాలిక..

    మీరు తీసిన సినిమాలు ఎంత ఘనాపాటివో గతంలో ఎలాంటివో బాక్సాఫీస్ వద్ద రెవెన్యూలు చెప్పాయి. అప్పుడు మీడియా ముందుకు వచ్చి సినీ విమర్శకులు చెప్పింది కరెక్టే.. మళ్లీ తప్పులు చేయను అని చెంపలు వేసుకోలేదే.. దువ్వాడ జగన్నాథం విడుదల తర్వాత సాయంత్రం వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం భయంగా ఆ థియేటర్‌కు.. అక్కడ నుంచి మరో థియేటర్‌కు పరిగెత్తిన అగ్ర దర్శకుడు సక్సెస్ కళ్ల ముందు కనపడగానే హరీశ్‌కు నాలిక అదుపు తప్పిందనే అభిప్రాయాన్ని పలువురు వెల్లడిస్తున్నారు.

    ఆయన రివ్యూపై ఆక్రోషమా?

    ఇంతకీ హరీశ్‌ శంకర్‌కు ఉక్రోషం కలిగించింది ఆ ఒక్కడి (ఆయన దృష్టిలో కత్తి మహేశ్ లేదా మరొకరు ) రివ్యూనేనా.. ఆయన తోచిన విధంగా సమీక్ష చేయవద్దా? మీకు అనుకూలంగానే సమీక్ష చెప్పాలా? ఇలా మీకు నచ్చని వారిపై మీరే కాకుండా? మరోకరి చేత మాటల దాడులు చేస్తారా? మీ సినిమాలో సత్తా ఉంటే ఒక్కడు రాసే రివ్యూ వల్ల డీజే భ్రష్టుపడుతుందని భయపడ్డారా? విజయం కనిపిస్తే బహిరంగంగా.. సినిమా బోల్తా పడితే కనిపించకుండా పోయే వాళ్లు ఇలాంటి నాసిరకమైన వ్యూహాలు పన్నుతాడా? మనుషులు ఎమోషన్స్ ఉంటాయి అనే విషయాన్ని ఆయనే మరిచిపోయాడా? అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చగా మారింది.

    English summary
    Duvvada Jagannadham Director Harish Shankar landed into contraversy. He targeted film critics at DJ Thankyou meet. He used filthy language on Film crictis. Now Harish statement is become huge discussion in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X