twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్, ఎన్టీఆర్ కాదు..ఇతనే మన కొత్త మెగాస్టారా?

    By Bojja Kumar
    |

    మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి తప్పుకుని రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆ స్థానాన్ని దక్కించుకునేది ఎవరు? అని సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న టాక్ ను బట్టి చూస్తే ఆ స్థానం దక్కించుకునే హీరోలు కేవలం మహేష్ బాబు లేదా జూ ఎన్టీఆర్ పేర్లు మత్రమే వినిపిస్తున్నాయి. అయితే కొందరు సినీ విశ్లేషకులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. మెగాస్టార్ లాంటి స్థానాన్ని అందుకునే సత్తా, అర్హత హీరో నానికి మాత్రమే ఉందంటున్నారు. స్టార్ హీరోల వారసులుగా ఎలాంటి కష్టాలకు ఓర్వకండా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన వారు అలాంటి స్థానికి అర్హులు కారని...వారికి టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అది సాధ్యం కాదంటున్నారు.

    ప్రస్తుతం నాని కెరియర్ స్లోగా సాగుతున్నప్పటికీ...కింది స్థాయి నుంచి ఎలాంటి సపోర్టు లేకుండా పరిశ్రమలో ఎదుగుతున్నాడు. అతను చేసిని సినిమాలు, తన సినిమాలకు ఎంచుకుంటున్న కథలు, పెర్ఫార్మెన్స్ చూస్తే... భవిష్యత్ మెగాస్టార్ అతనే అనే వాదిస్తున్నారు. అయితే మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. మా హీరోలకు వారసత్వం ఉందనే నెపంతో ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. ఎక్కువ విజయాలు, ఎక్కవు మంది ప్రేక్షకులు మెచ్చే హీరోనే మెగాస్టార్ స్థానానికి అర్హుడని అంటున్నారు. మరి ఈ వాద ప్రతి వాదలన నేపథ్యంలో....చిరు తర్వాత తెలుగు పరిశ్రమ మెగాస్టార్ ఎవరు? అనేది కాలమే నిర్ణయించాలి.

    English summary
    The latest buzz is, Hero Nani will reached senior Hero Megastar Chiranjeevi position.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X