రాజ్ తరుణ్‌పై కేసు పెట్టిన లవర్.. ఆ హీరోయిన్ చెల్లెలా? బయటపడ్డ సంచలన నిజాలు
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో మెప్పిస్తోన్న హీరోనే రాజ్ తరుణ్. వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న అతడు.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తనను నమ్మించి మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో సదరు అమ్మాయి.. టాలీవుడ్ హీరోయిన్ మాధవి లతకు సోదరి అని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు ఓ యువతి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడుతోన్న అతడిపై లావణ్య అనే ఓ అమ్మాయి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది.

రిలేషన్.. చంపేస్తానని
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య '11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. గతంలోనే మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ, తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు. ఇప్పుడు చంపేస్తానని నన్ను బెదిరిస్తున్నారు. కానీ, రాజ్ తరుణ్ నా ప్రపంచం నాకు కావాలి' అంటూ పేర్కొంది.
ఆమెవన్నీ అబద్దాలు
తనపై కేసు పెట్టిన అమ్మాయి గురించి రాజ్ తరుణ్ ఇప్పటికే మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. 'గత ఏడేళ్లగా లావణ్యతో రిలేషన్‌లో ఉన్న మాట వాస్తవమే. అయితే ఆమె అలవాట్లు నచ్చక దూరం పెట్టాను. ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయింది. వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూశాను. నా మాట వినలేదు. నన్నే టార్చర్ చేస్తోంది' అంటూ వివరించాడు.

షాకిచ్చిన పోలీసులు
రాజ్ తరుణ్‌పై లావణ్య అనే యువతి కంప్లైట్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అయితే, ఇప్పుడు పోలీసులు సదరు అమ్మాయికే షాక్ ఇచ్చారు. అతడిపై అభియోగించిన అన్ని అంశాలకు సంబంధించిన సాక్ష్యాలను తమకు సమర్పించాలని ఆమెకు నోటీసు పంపించారు. కానీ, అప్పటి నుంచి లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
లావణ్య ఆమెకు చెల్లి
హీరో రాజ్ తరుణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఉన్న మాధవి లతకు చెల్లి అని ఓ న్యూస్ శుక్రవారం నుంచి అటు సోషల్ మీడియాలోనూ ఇటు లైవ్ స్ట్రీమ్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు, మాధవి లత ద్వారా లావణ్య సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుందని కూడా టాక్ వినిపిస్తోంది.

బయటపడ్డ నిజాలు
రాజ్ తరుణ్ ప్రేయసి అని చెప్పుకుంటోన్న లావణ్య.. హీరోయిన్ మాధవి లతకు సోదరి అన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై సంచలన నిజాలు బయటకు వచ్చాయి. వీటి ప్రకారం.. అసలు లావణ్యకు, మాధవి లతకు ఏమాత్రం సంబంధం లేదట. కానీ, సినిమా అవకాశాల కోసమే ఆ అమ్మాయి ఈ టాక్‌ను వాడుకుందని నమ్మలేని అంశాలు తెరపైకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











