అల్లు అర్జున్ కొత్త చిత్రం 'బద్రీనాధ్' లోగో ఇదేనా?

By Srikanya

అల్లు అర్జున్, వివి వినాయిక్ ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'బద్రీనాధ్' చిత్రం లోగో అంటూ అనఫీషయల్ గా ఓ లోగో ప్రచారంలోకి వచ్చింది. అయితే అది గీతా ఆర్ట్స్ వారు క్రియేట్ చేసిందా కాదా అన్నది ప్రక్కన పెడితే చూడ్డానికి అయితే బాగుంది. ఇక ఈ చిత్రం కోసం ఆనంద్ సాయి నేతృత్వంలో కులుమనాలి దగ్గరలో మూడు కోట్ల సెట్ వేసారు. సినిమాలో మేజర్ పార్ట్ షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందని చెప్తున్నారు. దాదాపు 60 రోజులు పాటు రెండు షెడ్యూల్ లలో ఆ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షూటింగ్ డేస్ లో దాదాపు నలభైరోజులు ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ (పీరియడ్ డ్రామా)కే సరిపోతుందంటున్నారు. అప్పటి జరిగిన కథకు ఈ కాలానికి లింక్ వేసే సన్నివేశాలుకు ఇరవై రోజులు కేటాయిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ కోసం అల్లు అర్జున్ ఇప్పటికే వియాత్నం వెళ్ళి మార్షిల్ ఆర్ట్ నేర్చుకుని వచ్చారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి వర్మన్ కెమెరా వర్క్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X