twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకీ నటిస్తున్న నాగవల్లికి ఇంకా ఏడు సీక్వెల్స్ వస్తాయా...!?

    By Sindhu
    |

    విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నాగవల్లి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు, నాగవల్లి పాటలు సుపర్బ్‌గా వచ్చాయన్నారు. మొత్తం ఐదుగురు హీరోయిన్లున్నారనీ, వారిలో చంద్రముఖి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు.

    అనంతరం దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కొత్తదనం కావాలి. ఈ చిత్రంలో అన్ని రసాలున్నాయి. క్యారెక్టరైజేషన్‌ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఇంతకు ముందు చంద్రముఖిగా జ్యోతిక నటించిందనీ, ఇప్పుడు ఆ పాత్రలో మరో హీరోయిన్ కనిపించబోతుందన్నారు. వీరిలో ఎవరు బాగా నటించారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒక్కో హీరోయిన్‌ కు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుందనీ, దాని ప్రకారమే వాళ్లను చూపించామని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ..నాగవల్లికి ఇంకా ఏడు సీక్వెల్స్ వస్తాయని చెప్పారు. నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కొత్త వెంకీని చూస్తారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు, బ్రహ్మానందం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X