నిజమా : ‘చిన్నదాన నీకోసం’ టాక్ ఇదా?
హైదరాబాద్ : ఈరోజు నితిన్ చిత్రం ‘చిన్నదాన నీకోసం' విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచీ ఈ చిత్రం ఇన్ సైడ్ టాక్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అది ఎంతవరకూ నిజమో కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, నెట్ జనుల్లోనూ ఇది జోరుగా ముందుకు వెళ్తోంది. వారు చెప్పుకునేదాన్ని బట్టి ఈ చిత్రం కేవలం యావరేజ్ మాత్రమే.
అలాగే ఫస్ట్ హాఫ్ ...ఓకే అని, సెకండాఫ్ మాత్రం చాలా పూర్ గా ఉందని అంటున్నారు. ఫస్టాఫ్ లో అలీ తో కామెడీ బాగా చేయించాడని , అయితే సెకండాఫ్ లో కథపై కాన్సర్టేషన్ పేరుతో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గించేసారని అంటున్నారు. మరో ప్రక్క పవన్ ఈ చిత్రంలో గెస్ట్ అని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాదని నితిన్ సైతం స్పష్టం చేసారు. అయితే పవన్ ని, ఆయన సినిమాలను గుర్తు చేసేలా చాలా సీన్లు సినిమాలో ఉన్నాయంటున్నారు.
పన్నెండు వరస ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన నితిన్ తన వయస్సుకు తగ్గ లవ్ స్టోరీలు ఎంచుకుంటూ యాక్షన్ జోలికి వెళ్లకుండా సేఫ్ జోన్ లో కెరీర్ ని కొనసాగిస్తున్నారు. ఆయన ఇంతకు మునుపు చేసిన ‘ఇష్క్', ‘గుండెజారి గల్లంతయ్యిందే', ‘హార్ట్ ఎటాక్' మూడూ లవ్ స్టోరీలే. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ కొత్త చిత్రం కూడా మరో లవ్ స్టోరీ. అయితే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కు అథిక ప్రాధాన్యత ఇచ్చానంటున్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat

ఈ చిత్రంలో నితిన్ తన సొంత పేరుతో కనిపిస్తారు. అతను పవన్‌కల్యాణ్ అభిమానిని. ఒక రోమియో టైప్ కేరక్టరు. నితిన్ కుటుంబ సభ్యులు అతని గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పమంటే... అతనికు ఇప్పటివరకూ తనకు తగ్గ,సరైన గర్ల్ ప్రెండ్ దొరకలేదంటాడు. అయితే ఓ రోజు అతను నందిని(మిస్తి చక్రవర్తి)ని మొదటి సారి కలవగానే అతని జీవితం మారిపోతుంది. ఆ అమ్మాయి నచ్చగానే, ఆమెను ఇంప్రెస్ చేయడానికి అతను పడే పాట్లు, చివరకు ఆమెను ఎలా దక్కించుకున్నాడనేది చాలా ఇంటరెస్టింగ్‌గా, కొత్తగా ఉంటుంది.
నితిన్ మాట్లాడుతూ...‘ఇష్క్' ట్రావెల్ లవ్‌స్టోరీ, ‘గుండెజారి గల్లంతయ్యిందే' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ, ‘హార్ట్ ఎటాక్' ఎమోషనల్ లవ్‌స్టోరీ అయితే ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన లవ్‌స్టోరీ. ఇందులో కుటుంబ అనుబంధాలు చాలా బాగుంటాయి. వాటికంటే కూడా ఈ సినిమాలో హీరోయిన్‌ను మరింత ఎక్కువగా ప్రేమించే పాత్ర నాది. ఆ మూడు సినిమాల్లో కంటే ఇందులో క్లైమాక్స్ చాలా సా్ట్రంగ్‌గా, చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నారు.
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
నటీనటులు: నితిన్, మిస్తి,నాజర్, అలీ, నరేష్, సితార, మధునందన్ తదితరులు
కెమెరా: ఆండ్రూ,
మాటలు: హర్షవర్ధన్,
సంగీతం: అనూప్‌రూబెన్స్,
పాటలు: కృష్ణచైతన్య,
ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి,
ఆర్ట్: రాజీవ్ నాయర్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.
నిర్మాతలు: ఎన్.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి
సమర్పణ: విక్రమ్ గౌడ్.
విడుదల తేదీ: 25 డిసెంబర్,2014


Click it and Unblock the Notifications











