Dil Raju: గేమ్ ఛేంజర్ పోస్టర్ వల్లే ఐటీ దాడులా? దిల్ రాజుకు ఐటీ అధికారులు షాక్!
Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో గల ఆయన నివాసం, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం తెల్లవారు జామున ఏకకాలంలో దిల్‌రాజు ఆఫీస్, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆకస్మాతుగా దాడులుపై చేయడంతో పలు విషయాలు చర్చకు వస్తున్నాయి. ఇంతకీ అసలు కారణమేంటీ?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే..దిల్‌రాజు ఆఫీస్, దిల్‌రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇలా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా నగరంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. ఒకేసారి ఐటీ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం 200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించగా, దిల్ రాజు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది. మరోవైపు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ ద్వారా డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఆ సినిమాల హడావుడిలో ఉండగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. దిల్ రాజు బంధువులు, కూతురు హన్సితా రెడ్డి నివాసాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రొడ్యూసర్ దిల్ రాజు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సినిమాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచారు. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'గేమ్ చేంజర్'. ఈ సినిమాను దిల్ రాజు తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను దాదాపు 450 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు ఇండస్ట్రీ టాక్. ఎన్నో అంచనాలతో సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కానీ, ఎవరు ఊహించని విధంగా తొలిరోజు రూ. 186 కోట్ల వసూలను సాధించి పెట్టింది. కానీ, ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి.

ఇప్పటివరకు రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 126.40 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. మరోవైపు ప్రొడ్యూసర్ దిల్ రాజు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా విడుదల చేశారు. విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎనలేని ఆదరణ వస్తుంది. దీంతో ఈ సినిమా కేవలం వారం రోజులలో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇలా ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా ఈ సినిమాలు భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేస్తున్నాయంటూ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయంటూ స్పెషల్ పోస్టర్లు విడుదల చేయడం కూడా ఐటీ దాడులు కారణం కావోచ్చుననీ పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సడన్ గా ప్రముఖ మూవీ నిర్మాతలపై ఐటి దాడులు నిర్వహించడంతో ఇండస్ట్రీలో గందరగోళం నెలకొంది.


Click it and Unblock the Notifications











