మగధీర కథ ఇదే?

By Staff

మగధీర స్టొరీ లైన్ అంటూ ఓ కథ ప్రచారం లోకి వచ్చింది. వారు చెప్పే దాని ప్రకారం కాలభైరవ గా రామ్ చరణ్ కనపడతారు. అతని ప్రేయసి ఓ రాకుమార్తె. ఐతే కాలభైరవను ఎలాగైనా అంతం చేసి అతని ప్రేమను భగ్నం చేసేందుకు అంతఃపురంలోనే కుట్రలు జరుగుతుంటాయి. కాలభైరవ సవతి సోదరుడే (శ్రీహరి) ఇందుకు సూత్రధారి. ఆ కుట్రకు గురై తమ ప్రేమను పండించుకోలేక పోయిన కాలభైరవ, అతని ప్రియురాలు మరో జన్మ ఎత్తుతారు. కాలభైరవ ఒక స్టంట్ మన్ గా, ప్రిన్స్ ఓ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ తిరిగి కలుస్తారు. ఆ కాలంలో ఈ ఇద్దరి ప్రేమ జంటను విడిదీసిన సవతి సోదరుడే ఈ జన్మలో వారిద్దరినీ కలుపుతాడు. కాలభైరవగా-స్టంట్ మన్ గా రామ్ చరణ్, ప్రిన్స్ గా-ఫ్యాషన్ డిజైనర్ గా కాజల్, ఆ ఇద్దర్నీ విడదీసి మళ్లీ కలిపే పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు.

రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసారని వినికిడి. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదేనని తెలుస్తోంది. అలాగే చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ ఘరానామొగుడు లోని బంగారు కోడి పెట్ట పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసారు. అంతేగాక చిరంజీవి సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు. ఇక ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి డైరక్ట్ చేయటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X