మాజీ హీరోయిన్స్ కు క్రేజీ ఆఫర్స్ (ఫొటో ఫీచర్)
హైదరాబాద్ : సినీ వినీలాకాశంలో రారాణిలా వెలుగొందినా వివాహానంతరం అభినయ జీవితానికి స్వస్తిపలికే హీరోయిన్స్ ను చూస్తున్నాం. పాతకాలం నాటి హీరోయిన్లను (శ్రీదేవి,మాధురి దీక్షిత్ వంటి వారుని ) మినహాయిస్తే ఇటీవలి కాలంలోని హీరోయిన్స్ వివాహం తరువాత వారి ఉనికే తెలియడంలేదు.
అభినయంపై ఆసక్తి వివాహ బంధానికి అడ్డుకాదని చాటుకుంటున్న తారలూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక, మాలాశ్రీ, తారా, రక్షితా, శ్రుతిలను ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఇప్పటికీ వీరు చిత్రపరిశ్రమలో చురుగ్గా ఉన్నారు. కళామతల్లికి సేవ చేయాలనే తపనే వారిని ముందుకు నడిపిస్తోంది. వారి మలివిడత ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే ఎన్నెన్నో ఆసక్తికర అంశాలు..
స్లైడ్ షోలో ...

మీనా
తెలుగు,తమిళ,మళయాళ చిత్రాలలో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన మీనా...తెలుగు వారికి సీతారామయ్య గారి మనుమరాలి గా సుపరిచితురాలు. ఆమె రీసెంట్ గా మళయాళం చేసిన దృశ్యం సూపర్ హిట్ అవటంతో..తెలుగులోనూ ఆమె చేతే చేయించారు.

నదియా
గతంలో రమేష్ బాబు సరసన బజారు రౌడి చిత్రంలో కనిపించిన నదియా పెద్దగా హీరోయిన్ గా క్లిక్ కాలేకపోయింది. కానీ రీ ఎంట్రీ మిర్చి తో మంచి పేరు వచ్చింది. తర్వాత చేసిన అత్తారింటికి దారేది చిత్రం ద్వారా ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. రీసెంట్ వచ్చిన దృశ్యం లోనూ ఆమె కీలకమైన పాత్రను పోషించింది.

జ్యోతిక
మాస్, షాక్, చంద్రముఖి చిత్రాల హీరోయిన్ జ్యోతిక ని మర్చిపోయేవారు ఉండరు. ఆమె తర్వాత హీరో సూర్యని వివాహం చేసుకుని నటనా జీవితానికి స్వస్ధి పలికారు. ఆమె ఇప్పుడు మళ్లీ హౌ ఓల్డ్ ఆర్ యు అనే మళయాళ చిత్రం రీమేక్ లో చేస్తున్నారు.

స్నేహ
తెలుగులో శ్రీరామదాసు, రాధాగోపాలం, పాండు రంగడు, ప్రియమైన నీకు వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన స్నేహ గుర్తుండే ఉంటుంది. ఆమె వివాహం అయిన తర్వాత ఉలవచారు బిర్యాని చిత్రంతో తెలుగులో రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

ప్రియాంకా ఉపేంద్ర
ఎక్కడో పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ప్రియాంక సినిమాల్లో అవకాశాలు రావడంతో బెంగళూరు వచ్చారు. సూపర్‌స్టార్ ఉపేంద్రతో పరిచయం ప్రేమగా మారి వివాహ బంధానికి దారి తీసింది. బెంగళూరులోనే స్థిరపడ్డారు. వివాహానంతరం కొన్నేళ్ల పాటు సినీ జీవితానికి విరామం ప్రకటించినా రెండు మూడేళ్లుగా సినిమాల్ని అంగీకరిస్తూ వస్తున్నారు. పిల్లల ఆలనా పాలనా, ఆత్తామామలకు సేవ చేస్తూనే నటిగా రాణిస్తున్నారు. ఉపేంద్ర విజయం వెనుక ప్రియాంక పాత్ర ప్రముఖమైందని కుటుంబ సభ్యులు చెబుతారు. తాజాగా ఆమె 'ఉప్పి2' సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే మహిళా ప్రధాన చిత్రంలో నటించే సన్నాహాల్లో ఉన్నారు.

మాలాశ్రీ
కన్నడలోనే కాకుండా ప్రేమఖైదీ లాంటి సూపర్‌హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన మాలాశ్రీ ప్రముఖ నిర్మాత రాముతో వివాహానంతరం కొన్నేళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఇపుడు మహిళా ప్రధాన చిత్రాల ద్వారా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏడాదిలో ఒకటి రెండు సినిమాల్లో (ఎక్కువగా సొంత బ్యానర్‌వే) నటిస్తున్నారు.

రమ్యకృష్ణ
ఒకప్పుడు వెలుగు వెలిగిన రమ్యకృష్ణ దాదాపు అందరి హీరోలతో నటించింది. సంసార బాధ్యతను నిర్వహిస్తూనే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు ఆమె నటనా జీవితంలో కూడా రాణిస్తున్నారు. ఆమె టీవిషోలలో సైతం సినిమా రంగంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆమె రాజమౌళి బాహుబలి లో నటిస్తున్నారు.

రక్షిత
తెలుగులో పూరి జగన్నాధ్ ఇడియట్, శివమణి హీరోయిన్ గా పేరు సంపాదించిన దర్శకుడు ప్రేమ్‌తో వివాహం తరువాత అభినయానికి దూరంగా ఉన్నారు. అది తాత్కాలికమే అయింది. వెండి తెరపై కనిపించకపోయినా బుల్లితెరను ఎంచుకున్నారు. రియాలిటీ ప్రదర్శనల ద్వారా వీక్షకులకు చేరువయ్యారు. నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.

ఇంద్రజ
ఒకప్పుడు యమలీల చిత్రంలో అప్పటి కుర్రకారుని ఒక ఊపు ఊపిన ఇంద్రజ తర్వాత వివాహం అయ్యి...నటనా జీవితానికి స్వస్ధి పలికింది. ఇప్పుడు ఆమె దిక్కులు చూడకు రామయ్య చిత్రంలో ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది.

గౌతమి
ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన గౌతమి తర్వాత వివాహ బంధంతో నటనా జీవితానికి స్వస్ది చెప్పింది. తర్వాత జరిగిన పరిణాలతో కమల్ తో సహజీవనం ఇప్పుడు మళ్లీ దృశ్యం తమిళ వెర్షన్ లో ఆమె నటించనుందని తెలుస్తోంది.

రేవతి
రీసెంట్ గా రేవతి మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతున్న అనుక్షణం ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె అప్పటి అభిమానుల అలరించటానికి సిద్దమవుతోంది.

మంచు లక్ష్మి
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ...వివాహం అయ్యి... బిడ్డ తల్లి అయినా తనలోని నటనా తృష్ణను తృప్తిపరచటానికి బుడుగు అనే చిత్రం చేస్తోంది.


Click it and Unblock the Notifications











