»   » ఓర్ని... 'మనం' లో అమితాబ్ చేసేది అదా?

ఓర్ని... 'మనం' లో అమితాబ్ చేసేది అదా?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Is it true... Big B Character in Manam?
    హైదరాబాద్: మనం చిత్రంలో అమితాబ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ సైతం తన బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇంతకీ అమితాబ్ లాంటి పెద్ద స్టార్ ఈ తెలుగు సినిమాలో చేసేదేముంటింది అంటే పెద్దగా ఏమీలేదని వినిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.... ఆయన పర్టిక్యులర్ గా ఓ ప్రత్యకమైన పాత్రలో ఏమీ కనిపించరు. కానీ ఆయన లెజండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు గురించి మాత్రం ఎండ్ టైటిల్స్ సమయంలో చెప్తారని తెలుస్తోంది. ఆ విజువల్స్ తో కూడిన ప్రమోషనల్ ట్రైలర్ త్వరలో విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ఆయన హిందీలో మాట్లాడతాడా..తెలుగులో మాట్లాడతారా..లేక అసలు అమితాబ్ ని తీసుకున్నది వేరే గెస్ట్ రోల్ కోసమా అన్నది తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.

    అమితాబ్ తన బ్లాగులో ''నా మిత్రుడు నాగార్జున, అతని తండ్రి నాగేశ్వరరావు కలిసి నటించిన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇటీవల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాను'' అంటూ రాసుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమిది. అక్కినేనిపై అభిమానంతో బిగ్‌బీ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారని సమాచారం.

    అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఇప్పుడు మరో ప్రత్యేకత చేరింది. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. 'మనం' పాటలను ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఒక పాటను విడుదల చేశారు. ఈ చిత్రానికి అనూప్‌ సంగీతం అందించారు.

    అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    
 
 It is heard that, Amitab hasn’t played any particular role in Manam, but he will be seen speaking about the legendary actor ANR at the end titles of the movie. These visuals are also to be used in new promotional trailer.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more