వర్మ తనపై తానే గుడ్లు విసిరించుకున్నారా?
రామ్ గోపాల్ వర్మపై విజయవాడ సిద్దార్ధ కాలేజిలో డిసెంబర్ 11, 2010న కోడుగుడ్లు విసిరారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కోడిగుడ్లు వర్మే స్వయంగా విసిరించుకున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో కొత్త వార్త బయిలుదేరింది. అయితే ఎందుకు వర్మ అలా చేసాడు అంటే కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమేనని, తనపై ప్రత్యేకమైన అటెంక్షన్ క్రియోట్ చేసుకోవటం కోసమేనని అంటున్నారు. అందుకే ఆ విసిరిన వ్యక్తులు ఎవరనేది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులకు అంతుపట్టలేదని, అయితే వర్మ స్వయంగా గుడ్లు విసిరించుకోవటం అనేది నిజం కాదని, అది విజయవాడకు చెందిన కొందరు బెజవాడ రౌడీలు సినిమా టైటిల్ విషయంలో తలెత్తిన తలనొప్పుల నేఫధ్యంలో చేసిన పని అని, అయితే అక్కడకి వచ్చినందుకు తమ సిటీపై బ్యాడ్ నేమ్ రావటం ఇష్టం లేనివారే ఈ తరహా రూమర్స్ ని ప్రచారంలోకి తీసుకువస్తున్నారని మరో క్లారిఫికేషన్ వినపడుతోంది. వర్మ విషయంలో ఏది నిజం, ఏది అబధ్దం అనేది తేలాలంటే వర్మే వచ్చే చెప్పాలి.


Click it and Unblock the Notifications











