'వేదం' స్క్రీన్ ప్లే ఆ ప్లాప్ చిత్రంది ఒకటేనా?
క్రిష్ దర్శకత్వంలో రేపు రిలీజ్ కానున్న 'వేదం' చిత్రం, ప్రకాష్ దర్శకత్వంలో వచ్చి ప్లాపైన ఓం శాంతి రెండూ..ఒకే తరహా స్క్రీన్ ప్లే తో సాగుతాయని తెలుస్తోంది. చిత్రంలో ప్రధాన పాత్రలు ఒక దానితో ఒకటి సంభందం లేకుండా వేర్వేరు కథలతో ఉండి చివరలో అవి ఓ క్లైమాక్స్ లో కలుసుకుని వారి జీవన ఫంధాన్ని పునర్ నిర్వచించుకోవటమే కధాంశం అంటున్నారు. ఈ తరహా చిత్రాలు గతంలో హాలీవుడ్ లో వచ్చేవి. ఆస్కార్ విన్నింగ్ సినిమా క్రాష్ ఇదే తరహాలో ఉంటుంది. అలాగే ఆ మధ్య హిందీలో వచ్చిన ముంబయి మేరీ జాన్ చిత్రం, యహీ మేరీ ఇండియా లు కూడా ఇదే స్క్రీన్ ప్లేతో ఉండటం గమనార్హం. అదే ఓం శాంతి దగ్గరకు వస్తే ఈ చిత్రంలో ఐదు కథలు ఉంటాయి. ఆ కథలు..ఐదు జీవితాలను చెప్తాయి..వీటితో పాటు ఓ జీవిత సత్యం కూడా ఆవిష్కారమయ్యేలా కథ రాసుకున్నారు.
ఇక వేదం చిత్రంలో అల్లు అర్జున్, అనూష్క, మంచు మనోజ్,మనోజ్ బాజపయ్ లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అల్లు అర్జున్ మాస్ క్యారెక్టర్ కేబుల్ రాజుగా చేస్తూండగా, మనోజ్..రాక్ స్టార్ గా కనిపిస్తాడు. అలాగే అనూష్క వేశ్య పాత్రలో కీలకంగా కనిపిస్తుంది. వీరివి ఎవరి కథలు వారివే. ఇవన్నీ చివరకు ముడిపడతాయి.క్రిష్ గత చిత్రం గమ్యం మంచి హిట్ అవటం అంతటా మంచి పేరు తేవటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఓం శాంతి తరహాలో ఉండటమే కాస్తంత ఇబ్బంది పెట్టే అంశం అంటున్నారు. ఏ విషయం రేపు రిలీజ్ అయ్యాక కానీ తెలియదు.


Click it and Unblock the Notifications











