జీవితా రాజశేఖర్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. ఎంపీగా ఎన్నికల బరిలోకి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?

దక్షిణాదిలో ప్రముఖ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత జీవితా రాజశేఖర్ కొన్నేండ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఇటీవల కాలంలో తెలంగాణ పాలిటిక్స్‌లో దూకుడు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాజకీయా్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం జీవితా సేవలను పార్టీకి ఉపయోగించాలనే నిర్ణయం తీసుకొన్నది. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అయితే జీవితా రాజశేఖర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే వివరాల్లోకి వెళితే..

 కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో

కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో


సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా జీవితా రాజశేఖర్‌‌ చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి.. ప్రజారాజ్యం పార్టీ పెట్టే సమయంలో ఆమె కుటుంబంపై మెగా అభిమానులు దాడుల చేసిన వివాదాస్పద సంఘటన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. అనంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో కొంతకాలం కొనసాగారు. అంతకు ముందు టీడీపీతో కూడా వారికి అనుబంధం ఉంది.

బీజేపీలో కీలకంగా మారి..

బీజేపీలో కీలకంగా మారి..


అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీజేపీకి జీవితా రాజశేఖర్ దంపతులు చేరువయ్యారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కూతురు కవితపై తీవ్ర ఆరోపణలతో నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీలో ప్రస్తుతం వాగ్దాటి, గుక్క తిప్పుకోకుండా సుతిమెత్తగా విమర్శలు చేయగల సమర్ధురాలు అనే ముద్రను వేసుకొన్నారు.

అసెంబ్లీకి పోటీ చేయాలని..

అసెంబ్లీకి పోటీ చేయాలని..


ఇటీవలా కాలంలో బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్న జీవితా రాజశేఖర్‌ తనకు అనుకూలమైన జూబ్లీ హిల్స్ శాసన సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే హైదరాబాద్ నగరంలో ఈ స్థానానికి పోటీ భారీగా ఉండటంతో జీవితా రాజశేఖర్‌కు టికెట్ ఇవ్వడంపై నేతలు వెనుకడుగు వేశారనేది పార్టీ వర్గాలు వెల్లడించిన సమాచారం.

గెలుపు గుర్రాలపై బీజేపీ

గెలుపు గుర్రాలపై బీజేపీ


తెలంగాణ ప్రాంతంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ నాయకత్వం సినీ తారలను వీలైనన్నీ చోట్ల పోటీ చేయించాలనే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. గ్రేటర్ పరిధిలోని కీలక స్థానాల్లో ధనబలంతోపాటు కింది స్థాయి నేతలను, ఓటర్లను ప్రభావితం చేసే జీవితా రాజశేఖర్ లాంటి గెలుపు గుర్రాలపై బీజేపీ అధినాయకత్వం దృష్టిపెట్టింది. అంతేకాకుండా సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేస్తున్నట్టు తెలుస్తున్నది.

 జహీరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి?

జహీరాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి?


తెలంగాణ ప్రాంత రాజకీయ పరిస్థితులపై పలు ఈక్వేషన్లు, సమీకరణాలతో బీజేపీ ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే జీవితా రాజశేఖర్‌ను జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ స్థానం నుంచి జీవితా రాజశేఖర్ పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఎంపీ భీమ్‌రావు బస్వంతరావు (బీబీ పాటిల్‌)ను ఎదుర్కోవడంపై పార్టీ నేతలతో కలిసి జీవితా రాజశేఖర్ సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X