ఆ మాట రావద్దనే బాలయ్య కోసం జూ ఎన్టీఆర్...!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా 'శ్రీమన్నారాయణ' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవి చావలి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. ఈచిత్రం ఆడియో వేడుక ఆగస్టు 6న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‍లో జరుగబోతోంది.
ఈ వేడుకకు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హాజరవుతారనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇటీవల రాజకీయంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బాబాయ్, అబ్బాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవనే గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ఇప్పటికే ఖండించారు.
'శ్రీమన్నారాయణ' ఆడియో వేడుకకు హాజరవ్వడం ద్వారా ఆ వదంతులకు చెక్ పెట్టాలని, తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే నిరూపించడానికి జూ ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా సినిమా 'బాద్ షా' షూటింగు నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక కోసం జూనియర్ ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా వస్తారా? ఆలోపు అక్కడ షూటింగ్ కంప్లీట్ అవుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా...నందమూరి అభిమానులు మాత్రం ఈ ఇద్దరూ స్టార్స్‌ని ఒకే వేదికపై చూడాలని ఆశ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











