Jr NTR అభిమానిది హత్య? ఆత్మహత్యనా? ఊహకు అందని షాకింగ్ విషయాలు వెలుగులోకి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉరి వేసుకొని మరణించారనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్యామ్ మరణంపై రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో ఈ మరణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్యామ్ మరణంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్యామ్ మరణం ఆత్మహత్యా? హత్యా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శ్యామ్ మరణానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
శ్యామ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎన్టీఆర్ అభిమాని నిరుద్యోగి. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. శ్యామ్ చనిపోయిన ప్రదేశం చింతలూరు గ్రామం. ఇంటిలో కుర్చీ మీద నిలబడి ఉరి వేసుకొన్నట్టు కనిపించింది. అయితే ఆయన బాడీ మోకాలి వరకు నేలపై ఉంది. చేతికి బలమైన గాయం ఉంది. నోట్ల గంజాయి పెట్టినట్టు కనిపిస్తున్నది. అలాగే జేబులో గంజాయి ప్యాకెట్ ఉన్నట్టు సమాచారం. చింతలూరు గ్రామంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
శ్యామ్ ఉరి వేసుకొంటే కాళ్లు నేలకు తాకి ఎలా ఉంటాయి? శరీరం మీద, ముక్కు మీద గాయాలు ఎందుకు ఉంటాయి? జేబులో గంజాయి ప్యాకెట్లు ఎందుకు ఉంటే.. ఆ మత్తులో ఉరి ఎలా వేసుకొంటాడు? హ్యాండ్ కట్ చేసుకొంటే అంత నిలకడగా ఎలా ఉరి వేసుకొంటాడు? అనే ప్రశ్నలను సోషల్ మీడియాలో పెడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. ముక్కులో నుంచి రక్తం కారుతున్నది. చేతి మీద లోతుగా కత్తి గాటు. ఉరి వేసుకొంటే మెడపై ఉండే మరకలు కనిపించడం లేదు. కాళ్లు నేలమీదే ఉన్నాయి. ఇలాంటి అంశాలు ఆత్మహత్య కాదు అనే విధంగా బలమైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే శ్యామ్‌ను కొట్టి చంపితే ఎవరి పని అయి ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

అయితే మెడిశెట్టి శ్యామ్‌కు గంజాయి వినియోగించే అలవాటు లేదు. అతడి నోట్లో గంజాయి కుక్కారు. అతడి నోట్లోకి గంజాయి ఎలా వచ్చింది. చేయికి బలమైన గాయమైన వ్యక్తి ఎలా ఉరి వేసుకొంటాడు. హడావిడిగా అతడి అంత్యక్రియలు చేశారు. ఇవన్నీ అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం రాజకీయంగా అత్యంత వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు, నారా లోకేష్ ట్వీట్లు చేసి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసేలా చేశారు. వైసీపీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి .. ఈ ఘటన వెనుక దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











